తెలంగాణ

ఆలోచనలు మీవి ఆచరణ మాది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 18: బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఆవిర్భావంతోనే ముఖ్యమంత్రి కెసిఆర్ వందకోట్ల రూ.ల బడ్జెట్ కేటాయించడమే కాకుండా ఈ ఆర్థిక సంవత్సరంలో మరో వంద కోట్ల రూపాయలు విడుదల చేసారని ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి అన్నారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్రభారతిలో ప్రథమ తెలంగాణ బ్రాహ్మణ మహిళా సదస్సు జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమానికి అధ్యక్షత వహించిన బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు రమణాచారి మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పడిన తర్వాత సిఎం కెసిఆర్ ప్రత్యేకంగా బ్రాహ్మణుల సంక్షేమ పరిషత్ ఏర్పాటు చేసారని తెలిపారు. బ్రాహ్మణ మహిళలకు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో వరాల జల్లు కురిపించారు. పదవ తరగతిలో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణులైన పేద విద్యార్థులకు పదివేలు, డిగ్రీ చదువులకు పదిహేను, ఇరవై వేలు స్కాలర్‌షిప్‌లు మంజూరు చేసారు. ఉన్నత విద్యకోసం విదేశాలకు వెళ్లేవారికి పది లక్షలు, పదిహేను లక్షలు, ఇరవై లక్షల రూపాయలు- చదివే కోర్సునుబట్టి ఇస్తామని ప్రకటించారు. ఎవరితోను మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. బ్రాహ్మణ విద్యార్థులు యుపిఎస్‌సి పోటీ పరీక్షలకు కోచింగ్‌కు అయ్యే ఖర్చులో ఫీజు రీఫండ్ సౌకర్యం కల్పిస్తున్నామని అన్నారు. గ్రామాల్లో వుండే పేద బ్రాహ్మణులు తమ పిల్లలు కలెక్టర్‌లు అవ్వాలనుకుంటే హైదరాబాద్‌లో అటువంటి పేద విద్యార్థులకు ఉచిత హాస్టల్ వసతి, కోచింగ్ కల్పిస్తామని, ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలపై సలహా ఇచ్చి అవగాహన కల్పిస్తామని రమణాచారి చెప్పారు. బ్రాహ్మణులకు గుర్తింపు కార్డులతోపాటు హెల్త్‌కార్డులు కూడా మంజూరు చేసి అరవై సం.ల వరకు వైద్య పరీక్షలకు ఆర్థిక సహకారం అందిస్తాము. నిరుద్యోగులైన పేద బ్రాహ్మణులకు పరిశ్రమలు, వ్యాపారాలకు 30 శాతం ఆర్థిక సహాయం అందిస్తుంది. పేపర్ బ్యాగ్‌ల తయారీలో శిక్షణ ఇచ్చి కుటీర వ్యాపారంగా ప్రోత్సహిస్తాము. బ్రాహ్మణ మహిళలు బ్యూటీ పార్లర్, చీరల వ్యాపారం, యోగ శిక్షణాలయాలకు ఆర్థిక సహాయం అందిస్తామని రమణాచారి చెప్పారు. డబ్బింగ్ థియేటర్, యాంకరింగ్‌లో శిక్షణ సంస్థలకుకూడా ఆర్థిక సహాయం అందిస్తామని, జిల్లాల్లో బ్రాహ్మణ భవన్ నిర్మాణాలకు స్థలం చూపితే తాము భవనం నిర్మిస్తామని అన్నారు. నిర్మల్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి తమ ప్రాంతంలో ఎకరా స్థలం ఇస్తామని చెప్పగా, ఆగస్టులోగా అందులో భవన నిర్మాణం ప్రారంభిస్తామని అన్నారు.

చిత్రం.. రవీంద్రభారతిలో జరిగిన బ్రాహ్మణ మహిళా సదస్సులో ప్రసంగిస్తున్న కెవి రమణాచారి