తెలంగాణ

అన్ని వర్గాలకు ప్రభుత్వ ఫలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొండపాక, జూన్ 18: తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు సిఎం కెసిఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని, అన్నివర్గాల ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందాలనేదే సిఎం ఉద్దేశమని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆదివారం కొండపాక శివారులో సిఎం సభా స్థలి, దుద్దెడ గ్రామ శివారులో హెలిప్యాడ్ స్ధలాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈనెల 20న ముఖ్యమంత్రి కెసిఆర్ గొల్లకుర్మ అభివృద్ధి కోసం గొర్రెల పంపిణీ కార్యక్రమం ఇక్కడే ప్రారంభం ఆవుతుందన్నారు. 60 ఏళ్లుగా ఏ వర్గాన్ని, ఏ కులాన్ని గత ప్రభుత్వాలు ప్రోత్సహించలేదన్నారు.దాంతో కుల వృత్తులు మరుగున పడ్డాయన్నారు. ఇప్పటికీ కుల వృత్తుల మీద ఆధారపడి చాలా మంది ప్రజలు జీవిస్తున్నారన్నారు. కుల వృత్తులకు సహకారం అందించి వారి అభివృద్ధికి కృషి చేయడం కోసం సిఎం అనేక కొత్త పథకాలు అమలు చేస్తున్నారన్నారు.గత ప్రభుత్వాలు కుల వృత్తులను పట్టించుకుంటే వారి పరిస్ధితి ఇంత దయనీయంగా ఉండేది కాదన్నారు.అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెంది తెలంగాణ ప్రజలందరూ సంతోషంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి ఆశయం అన్నారు.

చిత్రం.. అధికారులతో కలిసి సిఎం సభా స్థలిని పరిశీలిస్తున్న మంత్రి హరీశ్‌రావు