తెలంగాణ

అద్దెగర్భం.. అ‘క్రమ’దందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 18: తెలంగాణలో అక్రమ అద్దెగర్భం దందా క్రమంగా సాగుతోం ది. ఓ మహిళను అద్దెగర్భానికి ఒకసారి మాత్ర మే అనుమతించాల్సి ఉండగా, రెండు, మూడుసార్లు అదే మహిళను అద్దె గర్భానికి వినియోగిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వెలుగుచూసిన అద్దెగర్భం దందాతో వైద్య, ఆరోగ్య, పోలీస్ శాఖ అప్రమత్తమైంది. అద్దెగర్భం అక్రమ దందాపై ఉక్కుపాదం మోపేందుకు రాష్టవ్య్రాప్తంగా ఆసుపత్రులపై దాడులకు సిద్ధమైంది. మూడుపువ్వులు ఆరుకాయలుగా సాగుతున్న ఈ దందాపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. హైదరాబాద్‌లో బంజారాహిల్స్ రోడ్డు నెం 14లోని సాయికిరణ్ ఆసుపత్రిలో అధికారులు తనిఖీ చేయగా పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. రాష్టవ్య్రాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనతో ఆసుపత్రుల యాజమాన్యాలు ఆందోళనకు గురయ్యాయి. తాము చట్టపరంగా సరోగసీ నిర్వహిస్తున్నామని చెబుతుండగా, అధికారులు మాత్రం సరోగసీని 2014లోనే కేంద్రం నిషేధించిందని అంటున్నారు. పరస్పసర విరుద్ధ అభిప్రాయాలతో కొనసాగుతున్న ఈ అద్దెగర్భం దందాకు చట్టబద్దత లేదని వాదన. ఇదిలావుండగా వైద్యశాఖ, టాస్క్ఫోర్స్ అధికారులు హైదరాబాద్‌లో శనివారం సాయికిరణ్ ఆసుపత్రిపై దాడి చేసి రికాల్డులు స్వాధీనం చేసుకున్నారు. మొదట ఆసుపత్రి సీజ్ చేస్తున్నట్టు ప్రకటించిన అధికారులు, ఆసుపత్రిలో అద్దె గర్భం దాల్చిన 48 మంది మహిళలు ఉన్నందున ఆసుపత్రి సీజ్‌ను వాయిదా వేసుకున్నారు. అయితే ఆసుపత్రిలోని మహిళల విషయమై ఆదివారం చెబుతామన్న అధికారులు ఆ మహిళలను ఎక్కడికి పంపాలి..ఏం చేయాలి? అనే విషయాన్ని ఎటూ తేల్చలేకపోతున్నారు.
దీంతో అద్దెగర్భంతో ఉన్న మహిళలు ఆసుపత్రిలోనే బందీగా ఉన్నారు. కలకలం రేపుతోన్న సరోగసీ దందా నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. అద్దె గర్భం ద్వారా పిల్లలను జన్మనిచ్చేందుకు సహకరిస్తున్న ఆసుపత్రులపై దాడులు నిర్వహించేందుకు వైద్య,ఆరోగ్యశాఖ, పోలీస్, అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఆసుపత్రి యాజమాన్యం సరోగసి పేరుతో అక్రమార్జనకు పాల్పడుతోందని, ఒక్కొకరి నుంచి రూ. 30 నుంచి రూ. 40 లక్షల మేరకు వసూళ్ల పాల్పడతూ, అద్దె గర్భం ఇచ్చిన మహిళలకు కేవలం రూ. 3 నుంచి 4 లక్షల వరకు చెల్లిస్తున్నారని అధికారుల విచారణలో తేలడంతో అధికార యం త్రాంగం ఆసుపత్రుల్లో సోదాలు నిర్వహిస్తోంది. అద్దె గర్భం దాల్చడానికి నేపాల్, డార్జిలింగ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన మహిళలు తెలంగాణలోని ఫర్టిలిటీ ఆసుపత్రులకు వస్తున్నట్టు అధికారులు గుర్తించారు. కాగా ఆసుపత్రుల యాజమాన్యాలు అద్దె గర్భం కోసం మహిళలు కావాలంటూ పత్రికల్లో ప్రకటనలు, ఆయా ప్రాం తాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నారు. సరోగసికి బ్రోకర్లు 18 నుంచి 20 ఏళ్ల యువతులే టార్గెట్‌గా ఎంపిక చేసి ఆసుపత్రి యాజమాన్యాలకు అప్పగిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. సంతానం లేని వారు పిల్లలు కావాలనుకునే వారి నుంచి అధిక మొత్తంతలో డబ్బులు దండుకుని సరోగసి చేయించుకున్న మహిళల కు మాత్రం అతి తక్కువ డబ్బులు చెల్లిస్తున్నట్టు అధికారులు కనుగొన్నట్టు తెలుస్తోంది. చట్టబద్దత లేని సరోగసీ దందాపై అధికారులు తీవ్రం గా పరిగణిస్తూ తెలంగాణవ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రులపై సోదాలు నిర్వహిస్తున్నారు.