తెలంగాణ

ఇప్పటికీ సిసిటివి ఫుటేజీలు ఇవ్వని సిద్దిపేట పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 18: బ్యూటీషియన్ శిరీష, కుకునూరుపల్లి ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య కేసులో నిందితులు శ్రవణ్, రాజీవ్‌లను జైలుకు తరలించగా, ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. ప్రతి కేసును సిసిటివిల ఫుటేజీ ఆధారంగా ఛేదిస్తున్న పోలీసులు ఎస్‌ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య కేసులో సిద్దిపేట పోలీసులు నేటికీ సిసిటివిల ఫుటేజీలను అందజేయలేదనే మీమాంస అధికారులను సందిగ్ధపరుస్తోంది. కుకునూరుపల్లి ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి తన క్వార్టర్‌లోనే శ్రవణ్, రాజీవ్, శిరీషలతో కలసి విందు చేసుకున్నాడు. అయితే పోలీస్ స్టేషన్, అక్కడి ప్రాంగణంలోనే ఉన్న క్వార్టర్‌లో సిసి కెమెరాలు ఉన్నాయి. ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్యకు పాల్పడితే సిసిటివిలో తప్పకుండా రికార్డవుతుంది. మరీ పోలీసులు సిసిటివిల ఫుటేజీని ఎందుకు బహిర్గతం చేయడం లేదు? అని ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి బంధువులు అనుమానిస్తున్నారు. సిసిటివిలో రికార్డయిన సంఘటన దృశ్యం సాంకేతిక కారణాల వల్ల వీక్షించలేకపోతున్నామని పోలీసులు చెప్పడం అనుమానంగా ఉందని ప్రభాకర్‌రెడ్డి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇదిలావుండగా శనివారం ఈ ఘటనపై నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి ప్రత్యేక బృందాన్ని కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్‌కు పంపించారు. ఈ దర్యాప్తు బృందం కుకునూరుపల్లి చేరుకుని అక్కడి సిబ్బంది, ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి గన్‌మెన్, డ్రైవర్‌లను సహ పలువురు కానిస్టేబుళ్ల వాంగ్మూలాన్ని నమోదు చేశారు. సిసిటివిల్లో సాంకేతిక లోపం రావడంతో సిపియు బాక్స్‌ను హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. సాంకేతిక నిపుణులచే ఈ సిపియు బాక్స్‌ను తెరిపించే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇదిలావుండగా సిద్దిపేట పోలీసుల నిర్లక్ష్యంపై సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అనురాగ్‌శర్మ సిద్దిపేట ఏసిపి గిరిధర్‌ను హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏదీ ఏమైనప్పటికీ ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య కేసు దర్యాప్తులో సిసిటివి ఫుటేజీ ప్రధాన ఆధారంగా మారింది.