తెలంగాణ

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 19: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నైరుతీ రుతుపవనాలు బలంగా ఉండటంతో వర్షాలు బాగా కురుస్తున్నాయి. గత 24 గంటల్లో మహబూబ్‌నగర్, రంగారెడ్డి, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, మెదక్, మేడ్చల్, వికారాబార్‌తో పాటు ఇతర జిల్లాల్లో కూడా ఒక మోస్తరు నుండి భారీగా వర్షం కురిసిందని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ (ఇన్‌చార్జి) డాక్టర్ కె. నాగరత్న తెలిపారు. వచ్చే 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. గత 24 గంటల్లో రంగారెడ్డి జిల్లా కొందుర్గులో 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాదాపు రెండుగంటలపాటు కురిసిన వర్షంతో షాద్‌నగర్-కొందుర్గు ప్రాంతంలో చెరువులు, కుంటల్లోకి భారీగా నీరు చేరింది. ఖమ్మం జిల్లా బూర్గంపాడులో 14 సెంటీమీటర్లు, ములకలపల్లిలో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే నారాయణఖేడ్‌లో 11 సెం.మీ, జడ్చర్ల, వరంగల్ జిల్లా పర్వతగిరి, ఖమ్మం జిల్లా జూలూరుపాడులో పదేసి సెంటీమీటర్లు, దుమ్ముగూడెం, మధిర, ఖానాపూర్, యాచారం, రామన్నపేట, నర్సంపేటలలో తొమ్మిదేసి సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇతర ప్రాంతాల్లో కూడా భారీగావర్షం కురిసింది.
వర్షాలు కురుస్తుండటంతో చాలా ప్రాంతాల్లో రైతులు విత్తనాలు వేయడం ప్రారంభించారు. అయితే భూమి బాగా నానిన తర్వాతనే విత్తనాలు వేయాలంటూ వ్యవసాయ శాఖాధికారులు రైతులకు సూచిస్తున్నారు. అన్ని ప్రాంతాల్లోనూ రైతులకు అందుబాటులో విత్తనాలు ఉంచారు.