తెలంగాణ

పొత్కపల్లి రైల్వే స్టేషన్‌లో మైక్రోటవర్‌పై పిడుగుపాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుల్తానాబాద్, జూన్ 19: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి మినీ మైక్రో టవర్‌పై పిడుగు పడింది. దీంతో సిగ్నల్ సిస్టమ్ ఆగిపోవడంతో దాదాపు ఆరు గంటల పాటు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్, ఇతర గూడ్స్ రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పొత్కపల్లి-ఓదెల మధ్యలో గల ఆరు కిలోమీటర్ల పరిధిలో పెద్దఎత్తున పలు రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తెల్లవారుజామున 4.30 గంటలకు పిడుగు పడడంతో మధ్యాహ్నం 1 గంటల వరకు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఆగిపోయిన రైళ్లను కాషన్ ఆర్డర్ ప్రకారం రైళ్లను నడిపించారు. ఎక్స్‌ప్రెస్ రైళ్లు సంపర్క్, నవజీవన్, తెలంగాణ, రాజధాని, తమిళనాడు, కేరళతో పాటు పలు రైళ్లు సికింద్రాబాద్, ఢిల్లీ మధ్యలో నడిచే రైళ్లు ఆరు గంటల పాటు ఆగిపోయాయి. అలాగే భాగ్యనగర్, ఇంటర్‌సిటీ, రామగిరి, నాగపూర్ ప్యాసింజర్‌తో పాటు ఇతర గూడ్స్ రైళ్లు ఆగిపోవడంతో సికింద్రాబాద్, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, పెద్దపల్లి, ఖాజిపేట నుండి రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి తరలివచ్చి సిగ్నల్ సిస్టమ్‌ను పునరుద్ధరించారు. అలాగే కమ్యూనికేషన్‌ను బాగు చేశారు. దీంతో రైళ్లు యధావిధిగా నడవడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.