తెలంగాణ

ఆస్తిపన్ను వసూలులో కరీంనగర్ టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, మార్చి 30: ఆస్తిపన్ను వసూలులో కరీంనగర్ జిల్లా రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచిందని అదనపు జాయింట్ కలెక్టర్ డా. ఎ.నాగేంద్ర అన్నారు.
బుధవారం ఆస్తిపన్ను వసూలు, ఐఎస్‌ఎల్ నిర్మాణాలు, సంక్షేమ యూనిట్ల గ్రౌండింగ్‌పై ఎంపిడివోలు, ఈవోపిఆర్డీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో 70శాతం ఆస్తిపన్ను వసూ లు చేసి రాష్ట్రంలోనే జిల్లా మొదటిస్థానంలో నిలిచిందని, ఇదే స్ఫూర్తితో వందశాతం పన్నులు వసూలు చేయాలన్నారు. జిల్లాలో 1207 పంచాయతీలుండగా అం దులో 749జిపి ల్లో వందశాతం ఆస్తిపన్ను వసూలు చేశారని, ఇందులో జగిత్యాల సబ్‌డివిజన్‌లో 358 గ్రామాలు, కరీంనగర్ డివిజన్‌లో 98గ్రామాలు, పెద్దపల్లి డివిజన్‌లో 293గ్రామాలున్నట్లు పేర్కొన్నారు. 66శాతం ఆస్తిపన్ను వసూలుతో మహబూబ్‌నగర్ రెండో స్థానంలో, 65శాతం వసూలుతో ఆదిలాబాద్ మూడోస్థానంలో ఉండగా, మెదక్ జిల్లాలో 64శాతం వసూలు చేసి నాలుగోస్థానంలో ఉందన్నారు. పన్నుల వసూళ్ళలో జిల్లాల మద్య పోటీ తీవ్రంగా ఉందని, జిల్లాలో వందశాతం వసూళ్ళతో టాప్‌లో నిలపాలని సూచించారు. ప్రతి బుధవారం పన్నుల వసూళ్ళపై కలెక్టర్ సమీక్షిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ఇంటింటికీ వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించి బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే జిల్లాలో సిరిసిల్ల, వేములవాడలో నియోజకవర్గాల్లో వందశాతం ఐఎస్‌ఎల్ నిర్మించాలని, త్వరలో పెద్దపల్లి డివిజన్‌లో వందశాతం ఐఎస్‌ఎల్ పూర్తిచేసిన నియోజకవర్గంగా ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే అన్ని నియోజకవర్గాల్లో వందశాతం ఐఎస్‌ఎల్ నిర్మించాలని సూచించారు.