తెలంగాణ

చేనేత కార్మికుల కోసం కొత్త పొదుపు పథకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 22: రాష్ట్రంలోని చేనేత కార్మికుల కోసం ఒక నూతన పొదుపు పథకాన్ని ప్రారంభించనున్నట్టు చేనేత, జౌళి శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. చేనతే కార్మికులతో పాటు, పవర్ లూమ్ కార్మికులకు ప్రయోజనం కలుగుతుందని అన్నారు. గతంలో ఉన్న పొదుపు పథకాన్ని మార్చి, నేత కార్మికులకు ప్రయోజనం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. ఈనెల 24న పోచంపల్లిలో పొదుపు పథకాన్ని ప్రారంభిస్తారు. ఇప్టపి వరకు కార్మికుల వేతనాల్లో పొదుపు చేసే ఎనిమిది శాతానికి కేవలం ఎనిమిది శాతం మ్యాచింగ్ గ్రాంటు ఇచ్చేవారు.
నూతన పథకంలో భాగంగా దీన్ని రెట్టింపు చేస్తూ 16శాతానికి మ్యాచింగ్ గ్రాంటు ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమం నిర్వహించేందుకు తెలంగాణ హ్యాండ్లూమ్ వీవర్స్ థ్రిప్ట్ ఫండ్ సేవింగ్స్ సెక్యూరిటీ స్కీమ్ పేరుతో ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. చేనేత కార్మికులకు ఆర్థికంగా కొంత భరోసా ఇచ్చేందుకు, వారికి సామాజిక భద్రత కల్పించేందుకు ఈ పొదుపు పథకం సహాయపడుతుందని చెప్పారు.
దీంతో పాటు నేత కార్మికులకు భవిష్యత్తు అవసరాలకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చేందుకు అవకాశం ఏర్పడుతుందని అన్నారు. కో ఆపరేటివ్ సొసైటీల పరిధిలో పని చేసేవారు, సొంతంగా పని చేస్తున్న కార్మికులు, డైయింగ్, వార్పింగ్, వైండింగ్, సైజింగ్ వంటి చేనేత అనుబంధ రంగాల్లో పని చేస్తున్న వారికి ఇది వర్తిస్తుంది. 18 ఏళ్లు నిండిన నేత కార్మికులు అందరూ ఈ పథకంలో చేరవచ్చు. బతుకమ్మ చీరలపై మంత్రి సమీక్ష జరిపారు. చీరల ధరలను, ప్రొక్యూర్‌మెంట్ నిర్థారించేందుకు ఒక కమిటీ వేయనున్నట్టు తెలిపారు. దీంతో పాటు లూమ్ అప్ గ్రేడేషన్ కార్యక్రమం, వర్కర్ టూ ఓనర్ పథకంపై మంత్రి సమీక్షించారు. సమావేశంలో టైక్స్‌టైల్ శాఖ డైరెక్టర్ శైలజా రామయ్యర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.