తెలంగాణ

యాజమాన్య కోటా సీట్ల అమ్మకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 22: దేశం అంతా నగదు చెల్లింపులను నియంత్రించి డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తున్నా రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్, పార్మసీ కాలేజీల యాజమాన్యాలు మాత్రం యధేచ్ఛగా నగదు చెల్లింపులనే డిమాండ్ చేస్తున్నాయి. డిజిటల్ చెల్లింపులు జరిగితే ఫీజుకు మించి ఒక్క రూపాయి కూడా అదంగా తీసుకోవడానికి వీలు లేని పరిస్థితి కావడంతో నగదు చెల్లింపుల ద్వారా సీట్ల అమ్మకం పూర్తి చేస్తున్నాయి. రాష్ట్రంలో 14 ప్రభుత్వ కాలేజీలు, 182 ప్రైవేటు అన్ ఎయిడెడ్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 62,746 సీట్లు ఉండగా యాజమాన్య కోటాలో 18,823 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో దాదాపు 10వేల సీట్లు ప్రసిద్ధి చెందిన పది ప్రైవేటు కాలేజీల్లోనే ఉన్నాయి. కన్వీనర్ కోటా సీట్ల భర్తీ చేసిన తర్వాతనే ప్రైవేటు కాలేజీలు యాజమాన్య కోటాను భర్తీ చేయాల్సి ఉంటుంది. అయితే ఆ నిబంధనలను పట్టించుకోకుండానే యాజమాన్యాలు తమ సీట్లను అమ్మేస్తున్నాయి. ఒక్కో సీటుకు కొన్ని కాలేజీల్లో గరిష్ట ఫీజు 1.75 లక్షలు కాగా ఆయా కాలేజీల యాజమాన్యాలు 16 లక్షల రూపాయిల వరకూ డిమాండ్ చేస్తున్నాయని సమాచారం. ప్రజాప్రతినిధులు ఫోన్ చేసినా, యాజమాన్యాలు ఫీజు తగ్గింపు లేదని స్పష్టంగా చెబుతున్నాయి.
అధికారికంగా యాజమాన్య కోటా సీట్లకు ఖరారు చేసిన ఫీజుల మేరకు డిడి లేదా చెక్ తీసుకుంటున్న యాజమాన్యాలు మిగిలిన ఫీజుకు సంబంధించి నగదు చెల్లించమని డిమాండ్ చేస్తున్నాయి. బ్యాంకుల్లో, ఎటిఎంలలో నగదు ఉపసంహరణ, డిపాజిట్లపై ఎన్ని ఆంక్షలు ఉన్నా తల్లిదండ్రులు సీట్లు పోగొట్టుకోవడం ఇష్టం లేక నేరుగా నగదు చెల్లిస్తున్నట్టు తెలిసింది. కొన్ని కాలేజీల యాజమాన్యాలు నగరంలోనే కార్పొరేట్ ఆఫీసులను తెరచి, అక్కడ ఫీజును వసూలు చేస్తున్నాయి. డిడి లేదా చెక్ రూపంలో చెల్లిస్తామని చెబుతున్నా అందుకు వారు నిరాకరిస్తున్నారు.
మొత్తం నగదు చెల్లింపునకు సంబంధించి అనధికారిక రసీదులు చేతిలో పెడుతున్నారు. బి ఫార్మసీ కాలేజీల్లో ఇంకా అడ్మిషన్ల వ్యవహారం ప్రారంభం కాకముందే యాజమాన్య కోటా సీట్లను అమ్మేస్తున్నాయి. ‘ప్రభుత్వం సూచించిన ఫీజులకు మేం కాలేజీలను నడపలేం, యాజమాన్య కోటా సీట్లపై వచ్చిన ఆదాయంతోనే కాలేజీలు నడవాలి, అందుకే అదనంగా తీసుకోవలసి వస్తోంది....’ అని ఒక కాలేజీ ప్రతినిధి వ్యాఖ్యానించారు. అన్ని చోట్ల నగదు లావాదేవీలు కొనసాగుతున్నాయని, ఫీజులు నగదు రూపంలో వసూలుచేయడం కొత్తేమీ కాదని ఫార్మసీ కాలేజీల యాజమాన్య సంఘం ప్రతినిధి ఒకరు చెప్పారు.