తెలంగాణ

భరోసా కేంద్రంలో పాలకమండలి సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 22: హైదరాబాద్‌లోని భరోసా కేంద్రంలో పాలకమండలి గురువారం సమావేశమైంది. ఈ సమావేశంలో హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, హోంశాఖ కార్యదర్శి రాజీవ్ త్రివేది, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అనురాగ్ శర్మ, నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భరోసా కేంద్రం నిర్వహణ, బాధితులకు అందుతున్న పోలీస్ సహాయం, వైద్యం, పునరావాసంపై చర్చించారు. రెండేళ్ల భరోసాలో ఎన్నో అద్భుత విజయాలు సాధించిందని హోంమంత్రి నాయిని భరోసా కేంద్ర నిర్వాహకులను ప్రశంసించారు. అనాథలకు ఆప్తులుగా, బాధితులకు ఆసరగా నిలుస్తున్న భరోసా ఎంతో మందికి ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటి వరకు భరోసా కేంద్రానికి 1,931 ఫిర్యాదులు అందాయని, వీటిలో గృహహింస 1432, ఫోక్స్ చట్టం కేసులు 162, చిన్నచిన్న పెటీ కేసులు 286, అత్యాచారం కేసలు 51 వచ్చినట్టు అధికారుల తెలిపారు. అంతేకాకుండా కొన్ని కేసులను కౌనె్సలింగ్ ద్వారా పరిష్కరించారు. భరోసా కేంద్రం ప్రజాసేవకే ఉందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.