తెలంగాణ

రైతు సమగ్ర సర్వేకు సహకరించాలని కలెక్టర్లను కోరతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 22: తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన సమగ్ర రైతు సర్వేకు జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ సిబ్బంది సహకారం అందించాలని కోరతామని వ్యవసాయ శాఖ కార్యదర్శి సి. పార్థసారథి తెలిపారు. జిల్లాల్లోని వ్యవసాయ శాఖాధికారులతో గురువారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహిచారు. ఈ సందర్భంగా పార్థసారథితో పాటు వ్యవసాయ కమిషనర్ డాక్టర్ ఎం. జగన్‌మోహన్ కూడా మాట్లాడారు. రైతు సమగ్ర సర్వేను త్వరగా పూర్తిచేయాలని, ఇందుకోసం రెవెన్యూ సిబ్బంది సహకారం తీసుకోవాలని వారు సూచించారు. ఇన్‌పుట్ సబ్సిడీ, విత్తనాల పంపిణీ, ఎరువుల సరఫరా, మట్టినమూనాలను సేకరించడం తదితర అంశాలపై జిల్లాల నుండి సమాచారం అడిగి తెలుసుకున్నారు. రైతు సమగ్ర సర్వేను వందశాతం త్వరగా పూర్తి చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని, ఇందుకు అనుగుణంగా వ్యవసాయ శాఖాధికారులంతా పనిచేయాలని ఆదేశించారు. ఎక్కడైనా రెవెన్యూ సిబ్బంది సహకారం అందకపోతే తమకు సమాచారం ఇవ్వాలని వారు కోరారు. అవసరమైతే జిల్లా కలెక్టర్లతో చర్చిస్తామని పార్థసారథి, జగన్‌మోహన్ సూచించారు. సమగ్ర సర్వే పూర్తయ్యే వరకు క్షేత్రస్థాయి సిబ్బందికి ఇతర పనులేవీ అప్పగించవద్దని ఆదేశించారు.