తెలంగాణ

నీళ్లతో పాటు ఇంటర్నెట్ చరిత్ర సృష్టిస్తున్న తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 22: తాగునీటితో పాటు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తూ తెలంగాణ రాష్ట్రం చరిత్ర సృష్టిస్తోందని గ్రామీణ తాగునీటి సరఫరా ఇంజనీర్-ఇన్-చీఫ్ సురేందర్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లాల్లోని ఎస్‌ఇ, ఈఈలతో గురువారం ఇక్కడినుండి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ఆప్టికల్ ఫైబర్ కెబుళ్ల (ఓఎఫ్‌సి) డక్ట్ లేకుండా పైప్‌లైన్లు వేస్తే బిల్లులు చెల్లించవద్దని ఆదేశించారు. డక్ట్‌కు సంబంధించిన మెటీరియల్‌ను వెంటవెంటనే తెచ్చుకోవాలని సూచించారు. గ్రామాల్లో నిర్మిస్తున్న ఓహెచ్‌ఎస్‌ఆర్ నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రైమరీ, సెకండరీ పైప్‌లైన్లతో పాటు నిర్మాణాలు దాదాపు పూర్తయినందువల్ల ఇక ఎలక్ట్రో, మెకానికల్‌కు సంబంధించిన పనులపై దృష్టిపెట్టాలని కోరారు. పంప్, మోటార్ల కంపెనీలతో సమన్వయంగా పనిచేయాలని సూచించారు. భగీరథ టార్గెట్ తేదీలను దృష్టిలో ఉంచుకుని పంపులను తెప్పించుకోవాలని సురేందర్‌రెడ్డి సూచించారు.