తెలంగాణ

బడుగులకు లబ్ది చేకూరుతోందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 22: తెలంగాణ రాష్ట్రంలో బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీ వర్గాలకు లబ్దిచేకూరుతోందా అన్న అంశంపై రాష్ట్ర బిసి కమిషన్ దృష్టి కేంద్రీకరించింది. వివిధ శాఖల ఉన్నధికారులతో బిసి కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పంచాయితీరాజ్ ఇంజనీరింగ్, స్థానిక సంస్థలు, ఉపాధికల్పన శిక్షణ విభాగాల అధికారులతో గురువారం ఆయన సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టే వివిధ ఇంజనీరింగ్ పనుల్లో బిసిలకు ప్రాధాన్యత ఇవ్వాలని రాములు ఆదేశించారు. గ్రామాలనుండి కూలీలు ఎవరూ వలస వెళ్లకుండా, సొంత గ్రామాల్లోనే ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో బిసి కమిషన్ సభ్యులు వకుళాభరణం, గౌరీశంకర్, ఆంజనేయగౌడ్ తదితరులు పాల్గొన్నారు.