తెలంగాణ

గురుకులాల ఘనత మాదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, జూన్ 22: దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఎస్సీ, ఎస్టీ బిసి మైనార్టీ విద్యార్థులకు 510 గురుకుల పాఠశాలల ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణేనని డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి అన్నారు. గురువారం మహబూబాబాద్ జిల్లా పెద్దవంగరలో నూతనంగా మంజూరైన కస్తూర్బా గాంధీ ఇంగ్లీషు మీడియం బాలికల పాఠశాలను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కడియం మాట్లాడు తూ...ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావ్యవస్థ పటిష్టతకు ప్రభుత్వం కృషిచేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కెజి నుండి పిజి వరకు ఉచిత విద్యను అందించడంలో బాగంగా 510 రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటుకు దాదాపు రూ.12 వేల కోట్లు వెచ్చించామన్నారు. రాష్ట్రంలో లక్షా 7 వేలు వివిధ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని, వాటిని రాష్ట్రంలో ఉన్న వనరుల ఆదారంగా ప్రణాళిక ప్రకారం భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడంతో పాటు నాణ్యమైన విద్యాప్రమాణాలు పెంపొందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లో నమ్మకం కలిగేలా ఉపాధ్యాయులు విద్యాబోధన చేయాలన్నారు. గత సంవత్సరం జడ్పీఎస్‌ఎస్ పాఠశాలల్లో ఎస్‌ఎస్‌సిలో 80 శాతం ఫలితాలు రాగా, వచ్చే సంవత్స రం 100 శాతం ఫలితాలు విద్యార్థులు సాధించాలన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ఎస్‌ఎంసి సమన్వయంతో పనిచేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా 84 కస్తూర్బా పాఠశాలల్లో 29 అర్బ న్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసి నాణ్యమైన ఇంగ్లీషు మీడియం విద్యను అందిస్తున్నామన్నారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రీతిమీనా ఉపాధ్యాయులు క్రమశిక్షణ, సమయపాలన పాటిస్తే విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తూ నాణ్యమైన బోధన కల్పించాలన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ న్, అబ్దుల్ కలాం ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివారన్నారు. కష్టపడి చదివి విద్యార్థులు భావిభారత పౌరులు కావాలని కలెక్టర్ కోరారు. ఎంపి పసునూరి దయాకర్ మాట్లాడుతూ... బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయం గా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తోందన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో బోధనతో పాటు అనేక సదుపాయాలు కల్పిస్తూ ప్రతి విద్యార్థికి లక్ష రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే దయాకర్‌రావు మాట్లాడుతూ..రాష్ట్రంలోనే పాలకుర్తి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్ధేందుకు అందరి సహకారం కావాలని కోరారు.

చిత్రం.. పెద్దవంగరలో కస్తూర్బా పాఠశాలను ప్రారంభిస్తున్న ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి