తెలంగాణ

టీవీ ఆర్టిస్టుపై అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 22: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నాగోల్‌లో నివాసముంటున్న బుల్లితెర నటి (34)పై అత్యాచారం కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్టు గురువారం రాచకొండ మహేశ్ ఎం భగవత్ తెలిపారు. గురువారం ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ అనంతపురం తాడిపత్రికి చెందిన పి గిరీష్ మెడికల్ షాపు నిర్వహిస్తున్నాడు. కొంతకాలం క్రితం వీరికి పరిచయం ఏర్పడడంతో గిరీష్ అనే వ్యక్తి టివి ఆర్టిస్టుకు రూ.లక్ష అప్పుగా ఇచ్చాడు. ఆ డబ్బుల కోసం పలుమార్లు బెదిరించి అనంతపురంలో ఓ గదిలో బంధించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై చిత్రహింసలకు గురిచేసి ఆమెపట్ల దారుణంగా వ్యవహరించేవాడు. దీంతో అతడు పెట్టే బాధల్ని భరించలేక రాచకొండ షీ టీమ్ పోలీసులను ఆమె ఆశ్రయించినట్టు కమిషనర్ చెప్పారు.
తొలుత రూ. లక్ష తీసుకున్నందుకు గానూ సంతకాలు పెట్టాలని ఆమెను అనంతపురానికి రప్పించిన గిరీష్ తనకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశాడని, ఇంకా కొందరి పట్ల ఇలాగే వ్యవహరించేవాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్టు కమిషనర్ ఎంఎం భగవత్ చెప్పారు.
అరాచకాలకు పాల్పడిన నిందితుడు గిరీష్ బాధితుల ఇంగా ఎవరైనా ఉంటే ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని కూడా కమిషనర్ భగవత్ తెలిపారు.