తెలంగాణ

కరవు నివేదిక పంపడంలో నిర్లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 30: కరవు నివేదికను సకాలంలో కేంద్రానికి పంపడంలో రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని టిడిపి సభ్యులు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సభ్యుడు జీవన్ రెడ్డి, బిజెపి సభ్యుడు ఎన్‌వివిఎస్ ప్రభాకర్ ఆరోపించారు. బుధవారం శాసనసభలో కరవుపై చర్చ సందర్భంగా టిడిపి సభ్యుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో గత రెండేళ్లుగా కరవు విలయతాండవం చేస్తోందని, అన్ని పక్షాలను కలుపుకొని ఢిల్లీకి వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రైతాంగాన్ని ఆదుకునేందుకు నిధులు విడుదల చేసే విధంగా చూస్తామన్నారు. కరవు వల్ల 9 జిల్లాల్లో దాదాపు వెయ్యి మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఎంత మందికి రూ.6 లక్షల ఆర్ధిక సహాయం చేశారని ప్రశ్నించారు. 1983 నుంచి రాష్ట్రం విడిపోయే వరకు రకరకాల సమయాల్లో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, కడియం శ్రీహరి, ఇప్పుడు మళ్లీ అధికారంలో ఉన్నారని, అప్పుడు రైతుల ఆత్మహత్యల గురించి ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. నిజాం సుగర్స్‌ను ప్రైవేటీకరణ బారినపడకుండా, ప్రభుత్వం నిధులు మంజూరు చేసి ఎందుకు ఆదుకోరాదని ప్రశ్నించారు. గత కొన్ని రోజులుగా నిజాం సుగర్స్ ఉద్యోగులు, రైతులు ఆందోళన చేస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రప్రభుత్వం ముందుగానే కరవు మండలాలను గుర్తించి ఉంటే బాగుండేదన్నారు. రాష్ట్రంలో 443 కరవు మండలాలు ఉంటే, టిఆర్‌ఎస్ ప్రభుత్వం 231 కరవు మండలాలను మాత్రమే ఎందుకు గుర్తించిందన్నారు. రంగారెడ్డి, నల్లగొండ, కరీంనగర్, వరంగల్ జిల్లాల రైతాంగం కరవు రక్కసి కోరల్లో చిక్కుకున్నాయన్నారు. ఇన్‌పుట్ సబ్సిడీని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, సమైక్యపాలనలో తెలంగాణ రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని, కెసిఆర్ ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు తీసుకుంటున్న చర్యల వల్ల ప్రజల్లో విశ్వాసం పెరిగిందన్నారు. కృష్ణా జలాల కేటాయింపులో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. కెసిఆర్ పాలన వల్ల కరవు జిల్లా పాలమూరుకు న్యాయం జరుగుతోందన్నారు. బిజెపి ఎమ్మెల్యే ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో వందలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం కదలాలన్నారు. కరవు బృందానికి సకాలంలో నివేదికలు ఇచ్చే విధానాన్ని అవలంబించాలన్నారు.