తెలంగాణ

కెసిఆర్ ఊహాలోకంలో ఉన్నారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 22: ప్రభుత్వ భూముల రక్షణ కోసం కొత్తగా తెచ్చిన ఆర్డినెన్స చూస్తేనే ప్రభుత్వ డొల్లతనం ఏమిటో ఇట్టే అర్ధం అవుతోందని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎన్ ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు. గురువారం నాడు ఆయన పార్టీ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ ఆర్డినెన్స్ ద్వారా ప్రభుత్వ భూములకు రక్షణ అనేది ఉంటుందనే నమ్మకం తమకు లేదని పేర్కొన్నారు.
ప్రభుత్వానికి ప్రచారం మీద ఉన్న చిత్తశుద్ధి ప్రభుత్వ భూముల రక్షణపై లేదని ఆరోపించారు. ఇందులో పొందుపరచిన విషయాలు న్యాయస్థానాలను అగౌవరవ పరిచే విధంగా ఉన్నాయని , గతంలో అన్యాక్రంతమైన భూములను స్వాధీనం చేసుకోవాలనే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదని అన్నారు. రాష్ట్ర రాజధానిలో ఇంత తంతు జరుగుతున్నా సిఎం కెసిఆర్ తనకు ఏమీ తెలియనట్టు వ్యవహరిస్తున్నారని అంటే ఆయన ఊహా లోకంలో ఉన్నారా లేక తెలిసి వౌనం వహిస్తున్నారా అని నిలదీశారు. మూడేళ్ల టిఆర్‌ఎస్ పాలనలో లక్షకోట్ల రూపాయిలకు పైగా విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైపోతూ ఉంటే ప్రభుత్వం మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తోందని ఆరోపించారు. ఆర్డినెన్స్‌లో ఆక్రమించిన భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి, ఆక్రమణ దారులపై చర్యలకు ఎలాంటి నిబంధనలు లేవని అన్నారు. భూముల దురాక్రమణను ఈ ప్రభుత్వం అరికట్టలేదని స్పష్టమైందని, కనుక సిబిఐ దర్యాప్తు జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. ప్రభుత్వం వాడుకలో లేని మండల్ రెవిన్యూ ఆఫీసర్ వంటి పదాలు తెలంగాణ లేని అగ్రహారం భూములు వంటి పదాలను ఆర్డినెన్స్‌లో చేర్చారని ఆయన గుర్తుచేశారు. భూమి యాజమాన్యానికి సంబంధించి కీలకమైన భూ యాజమాన్య చీఫ్ కమిషనర్ పదవిని భర్తీ చేయకుండా ఏళ్ల తరబడి ఖాళీగా ఉంచడం చూస్తే ఉద్ధేశ్యపూర్వకంగా ప్రభుత్వ భూముల దురాక్రమణను ఈ ప్రభుత్వం వీలు కల్పిస్తున్నట్టుందని అన్నారు. గత పాలకులు కొందరు భూ ఆక్రమణ దారులకు ప్రయోజనం చేకూర్చడం కోసం భూ ఆక్రమణల కోర్టు నుండి కేసులను ఉపసంహరించుకుంటే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. నిజాం నాటి భూములకు సంబంధించిన వివరాలతో కూడిన బ్లూబుక్‌ను బహిర్గతం చేయాలని, రికార్డు రూమ్‌లో గల్లంతు అయినట్టు భావిస్తున్న ఫైలు వివరాలు వెల్లడి చేయాలని కూడా ఆయన కోరారు.