రాష్ట్రీయం

అధర్మం పెరిగితే పరమాత్మ వస్తారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 22: సమాజంలో అధర్మం పెరిగితే భగవంతుడు భువిపై అవతారమెత్తుతాడని విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి పేర్కొన్నారు. రిషికేష్‌లోని శారదాపీఠం భవనంలో గీతాచార్యుల (శ్రీకృష్ణుడి) విగ్రహాన్ని గురువారం ఆయన ప్రతిష్టించారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఎక్కడైతే అధర్మం పెరిగిపోతుందో అక్కడ భగవంతుడు అవతరిస్తారన్నారు. ప్రతి మనిషి భగవద్గీత పఠనం చేయాలని, అది మనిషి జీవితానికి చుక్కానిగా పనికివస్తుందన్నారు. తాను సన్యసించకపూర్వం వేదభూమి, కర్మభూమి అయిన ఈ ప్రాంతంలో పర్యటించానని గుర్తు చేశారు. వేదాంతం, తర్కము, మీమాంస తదితర శాస్త్రాలను అభ్యసించానని గుర్తు చేశారు. అలాంటి ప్రదేశంలో గీతాచార్యుల విగ్రహం ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. గీతాచార్యుల విగ్రహావిష్కరణ సందర్భంగ మహాకుంభాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శారదాపీఠం ఉత్తరపీఠాధిపతి బాలస్వామి, వేద విద్యార్థులు, స్వామివారి శిష్యులు పాల్గొన్నారు.

చిత్రం.. గురువారం రిషికేష్‌లోని శారదాపీఠం భవనంలో గీతాచార్యుల
విగ్రహాన్ని ఆవిష్కరించి పూజలు చేస్తున్న స్వరూపానందేంద్రస్వామి