తెలంగాణ

పట్టణాలు, నగరాల్లో పార్కింగ్ పాలసీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 22: రాజధాని నగరంతో పాటు రాష్ట్రంలోని ఇతర నగరాల్లో, పట్టణాల్లో తీవ్ర రూపం దాల్చిన వాహనాల పార్కింగ్ సమస్య పరిష్కారం కోసం ప్రత్యేక పాలసీ తీసుకు రానున్నట్టు పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. బేగంపేట క్యాంపు కార్యాలయంలో పోలీసు శాఖ, మున్సిపల్ శాఖాధికారులతో పార్కింగ్ సమస్యపై గురువారం సమావేశం నిర్వహించారు. నగరంలోని ప్రజలకు ప్రధానంగా పార్కింగ్, రోడ్ల నిర్వాహణ లోపాల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వీటిని తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే పలు ధపాలుగా రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ నగర పోలీసు కమీషనర్లు, మున్సిపల్ శాఖ అధికారులతో పార్కింగ్ పాలసీ రూపకల్పనపై సమావేశాలు నిర్వహించినట్టు చెప్పారు. ఈ మేరకు రూపొందించిన పార్కింగ్ పాలసీ డ్రాఫ్ట్‌పైన చర్చించారు. రోడ్లపై వాహనాలు తిరిగేందుకు నిర్థారించిన మార్గాన్ని కాపాడడం, రద్దీని తగ్గించడం ప్రధాన లక్ష్యాలుగా ఈ పాలసీ ఉంటుందని చెప్పారు. నగరాన్ని ప్రణాళిక బద్ధమైన అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ఈ పార్కింగ్ పాలసీ ఉపయోగపడుతుందని అన్నారు. నగరంలో మల్టీ లెవల్ పార్కింగ్ ఏర్పాట్లతో పాటు ఖాళీ ప్రదేశాల్లోనూ పార్కింగ్ సౌకర్యాలను కల్పించేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఖాళీ ప్రదేశాల్లో పార్కింగ్ కోసం ముందుకు వచ్చే వారికి పలు ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పారు. నూతనంగా భవనాలు నిర్మాణం చేసేవారు పార్కింగ్ కోసం నిర్థారిత స్థలం కన్నా ఎక్కువగా పార్కింగ్ కల్పిస్తే వారికి భవన నిర్మాణ అనుమతుల్లో సడలింపులు ఇచ్చే విషయం పరిశీలిస్తున్నట్టు చెప్పారు. గతంలో పార్కింగ్ కోసం ఉద్దేశించిన ప్రదేశంలో నిర్మాణాలు చేసిన కాంప్లెక్స్‌ల్లో కూల్చివేతలు వెంటనే చేపట్టాలని చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్‌కు ఆదేశాలు ఇచ్చారు. దీని కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సూచించారు.
నగరంలోని ట్రాఫిక్ తగ్గించగలిగే మెట్రో రైలు ప్రాజెక్టులోనూ పార్కింగ్ అంశాన్ని పరిగణలోకి తీసుకొని వినూత్నమైన పరిష్కారాలు వెతకాలన్నారు. ప్రస్తుతం ఉన్న మెట్రో స్టేషన్లతో ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా వాటికి అనుబంధంగా మల్టీ లెవల్ పార్కింగ్‌లు, స్కైవాక్స్ సరిపోయినంతగా కట్టాలన్నారు. ప్రస్తుతం నగర రోడ్లపై ఫుట్ ఓవర్ వంటెనలు తక్కువగా ఉన్నాయని, ఈ సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని, ఈ వంతెనల నిర్మాణంలో అధునాతన నిర్మాణ అంశాలను పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. పోలీసు, ట్రాఫిక్ పోలీసులతో కలిసి సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని కెటిఆర్ చెప్పార. దీని కోసం ట్రాఫిక్ నిపుణులను వినియోగించుకోవాలని సూచించారు. సమావేశంలో హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్, మున్సిపల్ శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, నగర పోలీసు కమీషనర్, జిహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఏ కమీషనర్లు, మెట్రో రైల్ ఎండి, పోలీసు అధికారులు పాల్గొన్నారు.