తెలంగాణ

తాగునీటి పథకాల ప్రణాళికకు ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 23: రాష్ట్రంలో వచ్చే ఏడాది చేపట్టే తాగునీటి పథకాల పనులకు సంబంధించిన ప్రణాళికను రాష్ట్ర స్థాయి పథకాల మంజూరు కమిటీ ఆమోదించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్సీ సింగ్ అధ్యక్షతన నగరంలోని తాగునీటి సరఫరా విభాగం కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమీక్షలో పాల్గొన్నారు. అనంతరం రాష్ట్రంలో అమలవుతున్న తాగునీటి సరఫరా పథకాలు గత ఏడాది పురోగతిని కూడా కమిటీ సమీక్షించింది. భగీరథ స్వరూపం, లక్ష్యంతో పాటు ప్రాజెక్టు నిర్మాణంలో అవలంభిస్తున్న వినూత్న పద్దతులను ఈ సమావేశంలో చర్చించారు. ఎన్‌ఆర్‌డబ్ల్యూపి సపోర్ట్ ఫండ్‌కు రూ.1984.67 కోట్లు, వాటర్ క్వాలిటీ మానిటరింగ్ అండ్ సర్వేలైన్స్ కోసం రూ.924.76 కోట్లు నిధులతో కూడిన ప్రణాళికకు కమిటీ ఆమోదం తెలిపింది. రైల్వే, హైవే క్రాసింగ్ దగ్గర భగీరథ ఇంజనీర్లు అనుసరిస్తున్న ట్రెంచ్ లెస్, హైడ్రాలిక్ పుషింగ్ విధానాలను కమిటీ ప్రశంసించింది. మొబైల్ యాప్‌తో పనులను నిరంతరం మానిటర్ చేసే విధానంతో పాటు తాగునీటి సరఫరా కోసం ఉపయోగిస్తున్న ఫ్లో కంట్రోల్ వాల్వ్ ల పని తీరును కమిటీ సభ్యులు పరిశీలించారు. ఫ్లో కంట్రోల్ వాల్వ్‌తో గ్రామంలోని ప్రతి ఒక్క ఇంటికి సమాన స్థాయిలో తాగునీరు సరఫరా చేయడం ప్రశంసనీయమన్నారు.