తెలంగాణ

రహస్య ఒప్పందం ఏమిటీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 23: ఎన్డీఏ అభ్యర్థికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మద్దతు ఇవ్వడంలోని ఆంతర్యం, రహస్య ఒప్పందం ఏమిటని టి.పిసిసి నాయకుడు, తెలంగాణ కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ ప్రశ్నించారు. ఎన్డీఏలో భాగస్వామి కాకపోయినా మద్దతు ఇవ్వడంలోని మతలబు ఏమిటో బయట పెట్టాలని ఆయన శుక్రవారం విలేఖరుల సమావేశంలో డిమాండ్ చేశారు. తెలంగాణ బిల్లు పాస్ అయ్యే సమయంలో స్పీకర్‌గా ఉన్న మీరాకుమార్ పాత్ర చాలా కీలకమైందన్న విషూయాన్ని కెసిఆర్ మరిచిపోరాదని అన్నారు. యుపిఎ అభ్యర్థికి మద్దతు ఇవ్వకపోతే కెసిఆర్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన బిల్లులోని హామీలు అమలు చేయని ఎన్డీఏకు ఎలా మద్దతునిస్తున్నారని ఆయన ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. రుణ మాఫీలు కోరడం ఫ్యాషన్‌గా మారిందని వ్యాఖ్యానించిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు రైతులకు క్షమాపణ చెప్పాలని, వెంకయ్య వ్యాఖ్యలతో బిజెపి రైతు వ్యతిరేకి అని తేలిపో యిందన్నారు.