తెలంగాణ

రిటైర్ అయన వారిని కొనసాగించవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 23: పదవీ విరమణ చేసిన అధికారులను కొనసాగించరాదని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రిటైర్ అయిన వారిని ఒఎస్‌డిలుగా, ప్రభుత్వ సలహాదారులుగా సుమారు రెండు వేల మంది ఉన్నారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో 15 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే పదవీ విరమణ చేసిన వారిని కొనసాగించడం ఎంత వరకు భావ్యమని ఆయన ప్రశ్నించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో, విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కొత్త జిల్లాలు, వాటి జిల్లా ఆఫీసుల సిబ్బంది కోసం యుద్ధ ప్రాతిపదికన 35 వేల మందిని వెంటనే నియమించాలని ఆయన కోరారు. ఇటీవల వెలుగు చూసిన భూ కుంభకోణాల్లో రిటైరైన ఉన్నతాధికారుల ప్రమేయం కూడా ఉన్నదని ఆయన తెలిపారు.