తెలంగాణ

షర్మిలకు రాష్ట్ర వైకాపా పగ్గాలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 23: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ 3పగ్గాలు2 ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిలకు ఇవ్వాలన్న డిమాండ్ రోజు రోజుకూ బలపడుతోంది. తెలంగాణలో వైకాపా బతికి బట్ట కట్టాలంటే షర్మిలనే సరైన నాయకురాలని, ఆమె సారథ్యంలోనే పని చేస్తామని అనేక మంది నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాఉండగా గురువారం (22న) నగర శివారులోని చంపాపేట (సాగర్ రోడ్డు)లో గల సామ నర్సింహారెడ్డి ఫంక్షన్ హాలులో తెలంగాణ శాఖ 3ప్లీనరీ2 జరిగింది. జిల్లాల నుంచి భారీ సం ఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చినా, వారిలో ఉత్సాహం కనిపించ లేదు. అందుకు కారణం వైఎస్ కుటుంబీకులు ఎవరూ వేదికపై లేకపోవడం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తెలంగాణ ప్లీనరీ తొలి సారి నిర్వహించిన ప్లీనరీ కాబట్టి వైఎస్ జగన్ హాజరై ఉంటే ఆ ఉత్సాహం వేరేలా ఉండేదని నాయకులు అంటున్నారు. జగన్ గురువారం విశాఖపట్నంలో భూ కుంభకోణాలపై నిరసనగా చేపట్టిన మహా ధర్నాలో పాల్గొనడం వల్ల ప్లీనరీకి హాజరుకాలేదు. జగన్ రాకపోయినా షర్మిల లేదా వారి తల్లి వైఎస్ విజయమ్మ వచ్చినా ఉత్సాహం కనిపించేది. నాయకులు తమ ప్రసంగాల్లో తెలంగాణలో షర్మిల నాయకత్వం వహించాలంటూ డిమాండ్ చేశారు. తెలంగాణ పార్టీ శాఖ అధ్యక్షుడిగా గట్టు శ్రీకాంత్ రెడ్డి బాగా పని చేస్తున్నప్పటికీ, షర్మిల గౌరవ అధ్యక్షురాలిగా ఉండాలని, తెలంగాణలో పర్యటిస్తే పార్టీ బలోపేతం అవుతుందని పలువురు సూచించారు.
కనుచూపులో లేదు, అయినా..
పైగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ కార్యదర్శిగా ఉన్న సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రసంగిస్తూ అధికారంలోకి రావడం కనుచూపుమేరలో లేదని అన్నారు. 2019లో ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వస్తామని, ఆ తర్వాత తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు దృష్టి సారించి, 2024లో అధికారం చేపట్టే దిశగా అడుగులు వేస్తామని తెలిపారు.