తెలంగాణ

ప్రణాళికాబద్ధంగానే భూ కుంభకోణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 23: తెలంగాణ రాష్ట్రంలో వేల కోట్ల భూ కుంభకోణానికి ప్రణాళికా బద్దంగానే పథక రచన జరిగిందని, దీని వెనుక సిఎం కెసిఆర్ పాత్రపై పలు ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో ఆయన శీల పరీక్షకు నిలవాల్సిందేనని టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మియాపూర్ భూ కుంభకోణంలో రెండు సర్వే నెంబర్లలోని 123 ఎకరాల భూముల విషయాన్ని ఎందుకు దాచిపెడుతున్నారో చెప్పాలని ఆయన కెసిఆర్‌ను నిలదీశారు. టిటిడిపి కేంద్ర కార్యాలయంలో రేవంత్ శుక్రవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, కెసిఆర్ ప్రభుత్వం గత ఏడాది జూన్ 1న భూ ఆక్రమణల నిషేధ చట్టాన్ని రద్దు చేయడంతో పాటు దానికి సంబంధించిన ప్రత్యేక కోర్టును కూడా ఎత్తివేస్తూ జివో 113ను విడుదల చేసిందని, వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంలో ప్రవేశపెట్టిన చట్టాలను రద్దు చేయాలంటే ముందుగా వాటి గురించి ఉభయ సభల్లో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఈ చట్టం రద్దు కావడంతో భూ ఆక్రమణదారులపై చర్యలకు అవకాశం లేకుండా పోయిందని, అందుకే భూ కుంభకోణాలు వరుసగా బయటపడుతున్నాయని అన్నారు. భూ ఆక్రమణ దారులకు సహకరించేందుకే ఈ చట్టాన్ని, ప్రత్యేక కోర్టును సిఎం రద్దు చేశారని ఆరోపించారు. తెరాస ఎంపి కె.కేశవరావుపై చర్య తీసుకోకపోగా, ఆయన కొన్న భూముల రిజిష్ట్రేషన్లు రద్దు చేసి చేతులు దులుపుకోవడం పట్ల రేవంత్‌రెడ్డి అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు.