తెలంగాణ

నిర్బంధ విధులకు నిండు ప్రాణం బలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, జూన్ 23: సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను అమలు చేయాలని జాతీ య కార్మిక సంఘాలు నిరవధిక సమ్మె చేస్తుం టే... మరో పక్క సమ్మె విచ్ఛిన్నానికి యాజమాన్యం నిర్బంధంతో విధులను చేయించుకోవడంతో శుక్రవారం వనం రాజేంద్ర ప్రసాద్ అనే హెడ్ ఓవర్ మేన్ నిండు ప్రాణాన్ని సింగరేణి భారీ డంపర్ మింగేయడంతో గని కార్మిక సంఘాలు తిరగబడ్డాయి. కె 329 అనే నెంబర్ గల డంపర్‌ను బొగ్గు లోడింగ్ చేసుకోవడం కోసం ఆపరేటర్ మధుసూధన్ రావు ఆ యంత్రాన్ని తీసుకువచ్చారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు రాజేంద్ర ప్రసాద్ ఆ డంపర్ వెనుక టైర్ ఢీకొని అక్కడిక్కడే మృతి చెందాడు. గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రి వద్ద జాతీయ కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగా యి. టిబిజికె ఎస్, సింగరేణి యాజమాన్యం తీరును తప్పుబడుతూ కార్మికుని దుర్మరణానికి వీరిని కారకులుగా చేస్తూ క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నేతలు వై.గట్టయ్య, రాజారెడ్డి, బడికెల రాజలింగం, యాదగిరి సత్తయ్య డిమాండ్ చేశారు. సింగరేణి ఆసుపత్రి వద్దకు ఆర్జీ-2 జి ఎం విజయబాబు పై దాడికి యత్నించారు. ఒక్కసారిగా కార్మికులంతా ఆర్జీ-2 జి ఎంపై తిరగబడడంతో సదరు జిఎం పరుగులు పెట్టారు. ఈ క్రమంలో తోపులాట జరిగిం ది. సింగరేణి అధికారి కారు అద్దాలను కార్మికులు ధ్వంసం చేశారు.

చిత్రం.. సింగరేణి ఆసుపత్రి ముందు ఆందోళన చేస్తున్న జాతీయ కార్మిక సంఘాల నాయకులు