తెలంగాణ

ప్రాణం తీసిన సరదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోనరావుపేట, జూన్ 23: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం పల్లిమక్త గ్రామంలో ముగ్గురు విద్యార్థులు శుక్రవారం ఈతకు వెళ్ళి నీటిలో మునిగి మృత్యువాతకు గురయ్యారు. రంజాన్ సందర్భంగా విద్యార్థులకు సెలవు ఇవ్వడంతో స్నేహితులు కలిసి సరదాగా ఈతకు వెళ్ళారు. గ్రామంలోని కుమ్మరికుంటలో ఈతకు వెళ్ళిన ఎనగంటి సంజీవ్ (14), కుడుకల మనోహర్ (14), కుడుకల రాజు (14) ఈతకు వెళ్ళారు. ఇందులో ఒక్కరికే ఈత రాగా, ప్రాణ స్నేహితులు కావడంతో ముగ్గురూ ఒకేసారి చెరువులో దూకారు. దూకడంతోనే నీటిలో బురద గుంటలోకి చొచ్చుకుపోయారు. అయితే సంజీవ్ తమ్ముడు దూరం నుంచి చెరువు వైపు చూడడంతో మునిగిపోతున్న విషయాన్ని తెలుసుకుని సమీపంలోని వ్యక్తులకు విషయం తెలిపాడు. వారు చెరువులోకి దూకి కాపాడే లోపే వారు మునిగిపోయారు. ముగ్గురు విద్యార్థులు సుద్దాల గ్రామంలో పదవ తరగతి చదువుతున్నారు. ఘటనా స్థలంలో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయ. సంఘటనా స్థలాన్ని వేములవాడ డిఎస్పీ చంద్రశేఖర్ అవధాని, చందుర్తి సిఐ విజయకుమార్, కోనరావుపేట ఎస్సై రమేశ్‌నాయక్‌లు పరిశీలించారు. కరీంనగర్ జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ఎంపిపి లక్ష్మి, జడ్పీటిసి అన్నపూర్ణ, మాజీ ఎఎంసి చైర్మన్ మనోహర్‌రెడ్డి, బిజెపి నాయకులు ఆది శ్రీనివాస్‌లు సంఘటనా స్థలాన్ని పరిశీలించి బాధిత కుటుంబాలను ఓదార్చారు.