తెలంగాణ

ఆర్ అండ్ బి ద్వారానే ప్రధాన నిర్మాణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 24: రాజధాని నగరంలో 80 కోట్ల రూపాయల వ్యయంతో తెలంగాణ అమర వీరుల స్థూపం నిర్మించనున్నట్టు రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. 350 కోట్ల రూపాయల వ్యయంతో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, 300 కోట్ల రూపాయల వ్యయంతో తెలంగాణ కళాభారతిని రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నట్టు చెప్పారు. 26 జిల్లాల కలెక్టర్ల కార్యాలయాలు ఒక్కోక్కటి 35 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నట్టు, 104 మంది ఎమ్మెల్యేల కోసం ఎమ్మెల్యే క్వార్టర్స్ నిర్మించినట్టు చెప్పారు. అదే విదంగా 80 కోట్ల రూపాయల వ్యయంతో అమర వీరుల స్థూపం, అంబేద్కర్ స్మృతి వనం వంటి ప్రాజెక్టులు చేపట్టినట్టు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్ అండ్‌బి శాఖ పై నమ్మకం లేక నిర్మాణ బాధ్యతలు ఇతరులకు అప్పగించారని, తెలంగాణ ఏర్పడిన తరువాత కీలక నిర్మాణాలు అన్నీ తిరిగి ఆర్ అండ్ బికి అప్పగించినట్టు మంత్రి చెప్పారు. ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న నిర్మాణాలను మంత్రి శనివారం సమీక్షించారు. తమ శాఖ ఆధ్వర్యంలో అనేక ప్రాజెక్టులు చేపట్టినందున త్వరలోనే ఖాళీలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు. 106 ఏఈ పోస్టులను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఆమోదం తెలిపారని, ఖాళీల భర్తీతో పాటు అర్హులైన వారికి పదోన్నతులు కల్పిస్తామని చెప్పారు. అదే సమయంలో నిర్లక్ష్యంగా ఉన్న అధికారులను ఉపేక్షించేది లేదని అన్నారు.