తెలంగాణ

దేశంలో ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 24: తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, బంగారు తెలంగాణ కలను సాకారం చేయాలని, తద్వారా దేశంలోనే ఆదర్శంగా ఈ రాష్ట్రాన్ని నిలపాలని పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ (ఈజిఎంఎం), సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (సెర్ప్) కి సంబంధించి జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్న అధికారుల అభినందన సభ శనివారం ఇక్కడ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకంలో మన రాష్ట్రం దేశంలోనే ఆదర్శంగా నిలవడం గర్వకారణమన్నారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో మొదటి మూడునెలల కాలంలోనే 1080 కోట్ల రూపాయల విలువైన ఉపాధిపనులను చేపట్టామని మంత్రి గుర్తు చేశారు. ఇదే ఉత్సాహంతో ఇక ముందుకూడా పనిచేయాలని అధికారులకు సూచించారు. సెర్ప్‌ద్వారా మహిళాసాధికారత, ఉపాధి అవకాశాలు పెద్దఎత్తున కొనసాగడం అభినందనీయమన్నారు. జాతీయ స్థాయితో పాటు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరచిన పలువురు అధికారులను మంత్రి సన్మానించారు. సిబ్బంది అంతా కలిసి పనిచేస్తే మెరుగైన ఫలితాలు సాధించేందుకు వీలవుతుందని పిఆర్ అండ్ ఆర్‌డి కమిషనర్ నీతూప్రసాద్, సెర్ప్ సిఇఓ పౌసమిబసు ఈ సందర్భంగా పేర్కొన్నారు. మహిళా సంఘాలను ప్రోత్సహించడం, ఉపాధిహామీని పెద్దఎత్తున అమలు చేయడంలో తెలంగాణ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. జాతీయ స్థాయిలో అవార్డు తీసుకున్న నిజామాబాద్ జిల్లా మనోహరాబాద్ సర్పంచ్ తిరుపతి రెడ్డి తదితరులు మాట్లాడారు.