తెలంగాణ

చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 31: సిఎం కెసిఆర్ చక్రవర్తిలా ఆయన కుటుంబ సభ్యులు సామంత రాజుల్లా వ్యవహరిస్తున్నారని టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. శాసన సభను టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంగా వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. సభలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ పెట్టడం ప్రభుత్వ ఏకపక్ష దోరణికి నిదర్శనమన్నారు. ప్రాజెక్టుల వ్యయాన్ని ఇబ్బడిముబ్బడిగా పెంచి, ప్రాజెక్టుల ఎత్తుతగ్గించడాన్ని నిరసిస్తూ తాము సభను బహిష్కరించామని తెలిపారు. 60 ఏళ్ల స్వాతంత్ర భారతంలో ఏ శాసన సభలోనూ, చివరకు పార్లమెంట్‌లోనూ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వలేదని చెప్పారు. ప్రభుత్వ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఈ తరహా తప్పుడు పనులకు పూనుకుందన్నారు. సభలో 120 మంది సభ్యులు ఉంటే అందరికీ సమాన హక్కులు ఉంటాయని చెప్పారు. సభలో కాకుండా ఏదైనా కమ్యూనిటీ హాల్‌లో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఆ అంశంపై సభలో చర్చిద్దామని మూడు రోజుల క్రితమే స్పీకర్‌కు తాము లేఖ రాసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తీసుకువెళుతున్నారని ఆరోపించారు.
ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే పవర్‌పాయింట్: కాంగ్రెస్
సిఎం కెసిఆర్ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, భట్టివిక్రమార్గ, చిన్నారెడ్డిలు మాట్లాడారు. మహారాష్టత్రో చేసుకున్న చీకటి ఒప్పందాలతో తెలంగాణ ప్రజలపై పెను భారం పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలపై రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. తాను ప్రాజెక్టులు ఏవిధంగా నిర్మించదలుచుకున్నది, డిజైన్లు మార్చి అంచనా విలువలను మార్చి తెలంగాణ ప్రజానికంపై ఆర్ధిక భారం మొపదలుచుకున్నడో వివరించేందుకే పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను చేస్తున్నారు. ప్రాణహిత గోదావరి జలాలపై 160 టి ఎంసీల నీటి పొందేందుకు హక్కు కలిగి ఉన్నాం. కాంగ్రెస్ హయంలో చేపట్టిన ప్రాజెక్టును తప్పుగా చిత్రీకరించేందుకు యత్నిస్తున్నారు. తుమ్మిడిహెట్టు వద్ద ప్రాజెక్టు నిర్మాణం అయితే గ్రావిటీతో నీరు సుమారు 80 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. దానికి విరుద్ధంగా మెడిగడ్డ వద్ద 148 మీటర్ల ఎత్తులోనే నిర్మించేందుకు ఒప్పందాలు చేసుకోవడం విడ్డూరంగా ఉంది. ముఖ్యమంత్రి ముంబయిలో అడుగుపెట్టేంత వరకు ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించాలని నిర్ణయించబడి ఉంది. ఆయన అడుగుపెట్టిన తరువాతే ప్రాజెక్టు రూపురేఖలు మార్చారని విమర్శించారు. పెన్‌గంగపై మహారాష్ట్ర 30 ప్రాజెక్టులు అక్రమంగా నిర్మించింది. తన ఆలోచన విధానాన్ని ప్రజలపై రుద్దాలనే ఆలోచనే తప్ప సిఎంకు ప్రజా సంక్షేమం ఆయన అవసరం లేదని విమర్శించారు. తెలంగాణ సమాజం కెసిఆర్‌ను క్షమించదన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా సభలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడాన్ని తాము ఖండిస్తున్నట్టు ఎమ్మెల్సీ షబ్బీర్ అలి అన్నారు.
లక్ష ఉద్యోగాలు భర్తీ చేయాలి: ఆర్.కృష్ణయ్య
ఎన్నికల సమయంలో కెసిఆర్ ఇచ్చిన హామీ మేరకు లక్ష ఉద్యోగాలు భర్తీ చేయాలని ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఉద్యమం జరిగిదే నియామకాల కోసమన్న విషయాన్ని మరిచి ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆయన మండిపడ్డారు. వందల సంఖ్యలో వెలువడుతున్న ఉద్యోగ నియామకాల కోసం లక్షల సంఖ్యలో ధరఖాస్తులు వస్తున్నాయంటే తెలంగాణలో నిరుద్యోగులు ఎంత మంది ఉన్నారో అర్ధం అవుతుందన్నారు.
రాజీవ్‌ను అవమానిస్తున్న కాంగ్రెస్ నేతలు: శ్రీనివాస్ గౌడ్
దేశంలో సాంకేతికత అభివృద్ధికి తోడ్పడిన మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీని అవమానపరిచేలా కాంగ్రెస్ నేతలు వ్యవహారం ఉందని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రాజక్టుల గురించి సవివరంగా వివరించేందుకు సి ఎం కెసిఆర్ సాంకేతికతను వినియోగించుకోవడం తప్పా అని ప్రశ్నించారు. నూతన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు జరుగుతున్న చర్చలో పాల్గొని సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు.