తెలంగాణ

క్యాపిటల్ గ్రంథం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 24: మనుషుల మధ్య ఘర్షణను సృష్టించి కృత్రిమ ప్రపంచానికి నాంది చెప్పిన పెట్టుబడి దారీ వ్యవస్థ నుంచి ప్రజలను కాపాడేందుకు కారల్‌మార్క్స్ ‘క్యాపిటల్ గ్రంథం’ అవసరం చాలా ఉందని మానవ హక్కుల నాయకుడు ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఈ గ్రంథం కార్మికులకు ధైర్యం, పెట్టుబడిదారులకు భయం, భవిష్యత్తుకు విశ్వాసం కలిగిస్తుందని ఆయన తెలిపారు. ఎఐటియుసి తెలంగాణ విభాగం కారల్ మార్క్స్ ద్వితీయ శతజయంతి సందర్భంగా ‘క్యాపిటల్ గ్రంథం-నేటి ప్రాముఖ్యత’ అనే అంశంపై శనివారం నిర్వహించిన సదస్సులో ప్రొఫెసర్ హరగోపాల్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ హరగోపాల్ ప్రసంగిస్తూ రాబోయే సమాజం ఎలా ఉంటుందో ఈ గ్రంథం చూపించిందని, అమెరికాలో వస్తున్న ఆర్థిక సంక్షోభం సమయంలో ఈ గ్రంథం ఉపయోగపడిందని అన్నారు. స్వార్థం కోసం సంపదను సృష్టించిన మనిషికి ఘర్షణను సృష్టిస్తూ అసలు మానవత్వం అంటూ లేకుండా చేసింది పెట్టుబడిదారులేనని ఆయన విమర్శించారు. పెట్టుబడిదారి వ్యవస్థ సమాజంలో అన్ని రకాల నేరాలను ప్రోత్సహిస్తున్నదని, ఇలాంటి ప్రమాదకరమైన వ్యవస్థను మార్చేందుకు కారల్ మార్క్స్ గ్రంథం దోహదపడుతుందని ఆయన తెలిపారు.