తెలంగాణ

కళాకారుల కోసం వెబ్‌సైట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 24: తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వివిధ కళాకారులందరినీ డిజిటల్ ప్రపంచంలోకి తీసుకు వచ్చేందుకు గాను తెలంగాణ రాష్టభ్రాషాభివృద్ధి, సాంస్కృతిక శాఖ ప్రత్యేక వైబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఈ వెబ్‌సైట్ ద్వారా కళాకారులందరూ తమ పేర్లను నమోదు చేసుకునే వీలుంటుంది. ఇంతేకాకుండా డిజిటల్ గుర్తింపు కార్డులను సైతం జారీ అవుతాయి. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.టిఎస్‌డిఓఎల్‌సి.కామ్ పేరుతో వెబ్‌సైట్‌ను తెలంగాణ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టిఐటిఏ) రూపొందించిందని దాని వ్యవస్థాపక అధ్యక్షుడు సందీప్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం సచివాలయంలోని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి చందూలాల్ ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. వెబ్‌సైట్ తయారు చేసిన టిఐటిఏను మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా తొలి డిజిటల్ ఐడి కార్డును రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎస్‌వి రమణాచారికి మంత్రి అందజేశారు. ఇక నుంచి ఈ వెబ్‌సైట్‌ను తెలంగాణ ఇన్నోవేషన్, ఇన్‌క్యుబేషన్ సెంటర్ (టిఐఐసి) నిర్వహిస్తుందని సందీప్‌కుమార్ వెల్లడించారు.

చిత్రం..శనివారం సచివాలయంలో కళాకారుల వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్న మంత్రి చందూలాల్