తెలంగాణ

ఎంతమంది కోదండరాంలు అడ్డుకున్నా కాళేశ్వరం కట్టితీరుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామాయంపేట, జూన్ 24: తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం నిర్మించే కాలేశ్వరం ప్రాజెక్టును ఎంతమంది కోదండరాంలు అడ్డుకున్నా కట్టితీరుతామని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శనివారం మెదక్ జిల్లా రామాయంపేటకు వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. గ్రామాలు ఆర్థిక పరిపుష్టి చెందాలని ప్రభుత్వం పనిచేస్తుంటే కోదండరాంకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ శక్తులే అతని వెనుక ఉండి నడిపిస్తున్నాయని ఆరోపించారు. మేధావిలా ఆలోచించి మంచిని మంచిగా గుర్తించాల్సిందిపోయి రాజకీయ నాయకుడిగా మాట్లాడడం తగదని హితవు పలికారు. జెఎసి ముసుగులో రాజకీయం మానుకొని స్వచ్ఛందగా పార్టీ పెట్టి లేదా..ఏ రాజకీయ పార్టీలోనైనా చేరి మాట్లాడాలన్నారు.
గతంలో తెలంగాణ సాధించాక చెరువులు కుంటలతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని సలహాలు ఇచ్చిన మీరు ఇప్పుడు చెరువులు, కుంటలు అభివృద్ధి చేస్తుంటే అడ్డుకోవడం ఏమిటన్నారు. 60 సంవత్సరాల పాలనలో జరగని అభివృద్ధి మూడు సంవత్సరాల్లోనే అనేక ప్రజా సంక్షేమ పథకాలతో పనిచేస్తున్నా మీకు కనిపించడంలేదా అని కోదండారంను ప్రశ్నించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ప్రాజెక్టులు కడుతుంటే రైతులచే కోర్టుల్లో కేసులు వేయిస్తున్నారని, దీంతో రైతులు నష్టపోతున్నారని గుర్తుచేశారు. కులసంఘాలకు ప్రోత్సాహం ఇస్తుంటే వాటిని సైతం విమర్శించడంపై మండిపడ్డారు.