తెలంగాణ

కెసిఆర్‌ది ఆంధ్రా పాలనే?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామాయంపేట, జూన్ 24: గత ఆంధ్రా పాలకుల మాదిరిగానే తెలంగాణ ముఖ్యమంత్రి పాలన ఉందని జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండారం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అమరుల స్ఫూర్తియాత్రలో భాగంగా శనివారం మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని నిజాంపేటకు చేరుకున్న బస్సుయాత్రకు ప్రజలు, జెఎసి నాయకులు ఘనస్వాగతం పలికారు. రైతులు, వృద్ధులు పింఛన్లు, రుణమాఫీ, రేషనుకార్డులు రాలేదని కోదండరాం దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా అక్కడ సభలో కోదండరాం మాట్లాడుతూ ప్రభుత్వ పాలన తీరును తప్పుబట్టారు. కులవృత్తులను ఆదుకుంటామంటూనే వారికి అన్యాయం చేస్తున్నారని అన్నారు. గొల్లకుర్మలకు సబ్సిడీ ద్వారా గొర్రెలను పంపిణీ చేస్తామని కెసిఆర్ లబ్ధిదారుల వాటాతో నిరుపేద గొల్లకుర్మలు పథకానికి దూరమవుతున్నారని అన్నారు. 90 వేలు సబ్సిడీ ఇస్తామని చెపుతున్నారని, అంతవరకే గొర్రెలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. గొల్లకుర్మలను లాటరీ పద్ధతిలో ఎంపిక చేసే విధానం బాగానే ఉందని, మరి సబ్సిడీ ట్రాక్టర్లను లాటరీ పద్ధతిలో ఎందుకు ఎంపిక చేయలేదని ఆయన ప్రశ్నించారు. రేషన్‌కార్డులు, పింఛన్ల పంపిణీకి కేంద్రం ఫుడ్‌సెక్యూరిటీ చట్టాన్ని తెచ్చిందని, ఆ దిశగా అందరికీ న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తామన్నారు. రుణమాఫీ అంటూనే బ్యాంకు అధికారులు కొత్త రుణాలు ఇవ్వడంలేదని, పాత రుణాల మాఫీకి పత్రాలు తేవాలని రైతులను బ్యాంకర్లు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. వ్యవసాయానికి విధానం లేదన్నారు. వలసజీవుల బతుకులకు బతుకుదెరువు చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రభుత్వం ప్రజల కోసం అధికారం చేయాలని సూచించారు. అన్ని సమస్యలను ప్రభుత్వానికి వివరించినా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడంలేదన్నారు. నాయకులు నిస్వార్థంగా పనిచేయాలని హితవు పలికారు. తెలంగాణ వచ్చినా దివంగత జయశంకర్ ఆశయాలకు కొనసాగించేందుకు ప్రభుత్వంపై పోరుకు సిద్ధమయ్యామని ప్రకటించారు.