తెలంగాణ

నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జూన్ 24 : రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు కృతనిశ్చయంతో పనిచేస్తోందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. ఈసంవత్సరం పాటు వచ్చే సంవత్సరం సైతం మరో డిఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. కొత్తగా 26 వేల పోలీసు కానిస్టేబల్ పోస్టుల భర్తీకి సిఎం కెసిఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు వెల్లడించారు. శనివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో టెట్ ఉచిత కోచింగ్ శిబిరాన్ని మంత్రి సందర్శించారు. విద్యార్థులతో కొద్ది సేపు ముచ్చటించి సౌకర్యాలు ఎలా ఉన్నాయని, కోచింగ్ ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు.
అభ్యర్థులు పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ప్రణాళికాబద్ధంగా చదువుకొని ఉద్యోగాన్ని సాధించాలన్నారు. ఉపాధ్యాయ పోస్టుకు టెట్ ఉత్తీర్ణత తప్పనిసరిగా మారిందన్నారు. ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు అన్ని పోస్టుల్లో టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి అని తెలిపారు. ప్రభుత్వం ఎలాంటి ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేసిన సిద్దిపేట ప్రాంత విద్యార్థుల కోసం ఉచిత కోచింగ్ ఏర్పాటు చేయిస్తానన్నారు. హైదరాబాద్‌లో పేరుగాంచిన మంచి ఫ్యాకల్టీతో ఉచిత కోచింగ్‌తో పాటు, పోటీ తరహా పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే అన్ని రంగాల్లో సిద్దిపేట ముందంలో ఉందని, ఉద్యోగ సాధనలో ముందు వరుసలో నిలుపాలని ఆకాంక్షించారు.
సిద్దిపేట పట్టణాన్ని ఆకుపచ్చ సిద్దిపేటగా అంతా పూర్తి సహకారం అందించాలన్నారు. పర్యావరణ పరిరక్షణ కృషిచేస్తూ భావితరాలకు మంచి వాతావరణాన్ని ఆస్తిగా అందించాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలసి సహపంక్తి భోజనం చేశా రు. విద్యార్థులకు మంత్రి హరీష్‌రావు స్వయంగా వడ్డించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్‌రెడ్డి, వైస్ చైర్మన్ నందిని శ్రీనివాస్, మార్కెట్ కార్యదర్శులు శ్రీనివాస్, పరమేశ్వర్, ఎంపిపి యాదయ్య, దువ్వల మల్లయ్య, జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు.