తెలంగాణ

సింగరేణి సమ్మె వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, జూన్ 24: సింగరేణి వ్యాప్తంగా పదిరోజులుగా వారసత్వ ఉద్యోగాల పథకం అమలు కోసం నిర్వహిస్తున్న సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు జాతీయ కార్మిక సంఘాల నాయకులు శనివారం ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆరు జిల్లాలోని 11 ఏరియాల పరిధిలోని సింగరేణి కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. వారసత్వ ఉద్యోగాలపై సింగరేణి యాజమాన్యం డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ సమక్షంలో నిర్వహించిన చర్చల్లో అంగీకారం కుదరకపోవటంతో జాతీయ కార్మిక సంఘాల నేతలు సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేశారు. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వై గట్టయ్య, సింగరేణి కోల్‌మైన్స్ లేబర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి జనక్ ప్రసాద్, సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి మందా నర్శింహారావు, భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర కార్యదర్శి లట్టి జగన్‌మోహన్, హెచ్‌ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ గోదావరిఖనిలో జరిగిన సమావేశంలో సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేశారు.