తెలంగాణ

జూలై నుంచి గ్రామాల్లో కొత్త బార్బర్ షాప్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 25:వచ్చేనెల నుంచి గ్రామాల్లోని బార్బర్ షాపుల రూపు రేఖలు మారిపోనున్నాయి. నారుూ బ్రాహ్మణులు, రజకులకు వృత్తి పని పరకరాల కోసం ప్రభుత్వం ఐదువందల కోట్ల రూపాయలు మంజూరు చేసింది. నగరాల్లో బార్బర్ షాపులు ఉన్నా గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా చెట్టు కిందనో, అరుగుపైనో క్షౌరం చేసే పరిస్థితులు ఉన్నాయి. దీనికి బదులు పట్టణ ప్రాంతాల్లో వలె గ్రామీణ ప్రాంతాల్లో కూడా క్షౌరకులకు బార్బర్ షాపులను ఏర్పాటు కోసం ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రకటించింది. వచ్చేనెల నుంచి ఇది అమలులోకి రానుంది.
ముఖ్యమంత్రి కెసిఆర్ వచ్చేనెల ప్రగతి భవన్‌లో నారుూ బ్రాహ్మాణులు, రజకులకు ఈ పథకాన్ని ప్రారంభిస్తారని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. ఇద్దరు మంత్రులు ఆదివారం సచివాలయంలో రజక, నారుూ బ్రాహ్మణ సంఘాల వారితో విడివిడిగా సమావేశం అయ్యారు. చేతి వృత్తులను కాపాడుకునేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తున్న ప్రయత్నాలను లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రజక, నారుూ బ్రాహ్మణ సంఘాల నాయకులు ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి తమ వర్గానికి చెందిన పేదలు, అర్హులైన వారి జాబితా సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేయాలని కోరారు.
అంతకు ముందు ఒక్కో సంఘం నుంచి పది మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రులు చెప్పారు. ఉపాధి కోసం కొనుగోలు చేసే పని ముట్లు, ఇతర సామాగ్రి ఎక్కడి నుంచి కొనాలి, ఏ కంపెనీ వంటి అంశాలు కూడా కమిటీ సూచన మేరకే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. హైదరాబాద్, సికిందరాబాద్ నగరాల్లో అన్యాక్రాంతమైన ధోబీఘాట్స్ స్థలాలను పరిశీలించేందుకు ప్రత్యేకంగా విచారణ కమిటీని వేయనున్నట్టు మంత్రులు తెలిపారు. ఇప్పటికే మత్స్య, గొల్ల, కుర్మ, చేనేత వర్గాల కోసం పథకాలు అమలు చేసినట్టు చెప్పారు. ఇక రజక, నారుూ బ్రాహ్మణ వర్గాలకు జూలైలో పథకాలను ప్రారంభించనున్నట్టు మంత్రులు తెలిపారు. 1200 కోట్ల రూపాయలతో చేనేతకు చేయూత పథకం ప్రారంభించినట్టు చెప్పారు. ఆధునిక టెక్నాలజీని వృత్తులకు అనుసంధానం చేస్తున్నట్టు చెప్పారు. వృత్తుల్లో ఉన్న వాళ్లు, పెట్టుబడి లేక ఇతరుల వద్ద పని చేస్తున్న వాళ్లకు పెట్టుబడి అందజేసి సొంతంగా షాపులు పెట్టుకునేట్టు చేస్తామని ఈటల రాజేందర్ తెలిపారు. ఈ సమావేశంలో ఎంబిసి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, బిసి సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి అశోక్ కుమార్, బిసి కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ మల్లయ్య భట్టు, ఎంబిసి సంఘం జాతీయ అధ్యక్షుడు కాళప్ప, ప్రధాన కార్యదర్శి సూర్యారావు, రజక సొసైటీ సంక్షేమ బోర్డు సభ్యులు ఎం రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.