తెలంగాణ

దివ్యాంగులకు ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 25: ఉన్నత విద్య చదివిన విద్యార్థులు చాలా మంది ప్రభుత్వ ఉద్యోగమో, ప్రైవేట్ ఉద్యోగమో దొరకక పోతే నిరాశకు గురై జీవితాన్ని నాశనం చేసుకుంటున్న తరుణంలో సమాజంలో అనేక మంది స్వయంకృషితో జీవిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాంటి వారిలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన బి. మోహన్ (85) అనే వృద్ధుడు యువతీ యువకులు ఆదర్శంగా నిలుస్తున్నాడు. మోహన్ వృద్ధుడే కాకుండా ఒకకాలు సరిగ్గా లేని దివ్యాంగుడు కూడా. గత ఆరు దశాబ్దాల నుండి చెప్పులు కుట్టడం, బూట్లకు, చెప్పులకు పాలిష్ చేసే వృత్తి (మోచీ) లో కొనసాగుతున్నాడు. జహీరాబాద్‌లో అనుకున్నమేరకు ఆదాయం లభించకపోవడంతో హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డాడు. హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ ఎదుట (డిఆర్‌డిఓ టౌన్‌షిప్‌కు దగ్గర్లో) మోచీ వృత్తి కొనసాగిస్తున్నాడు. మోహన్ వృత్తిపనికి పెట్టుబడి హంగామా ఏమీ లేదు. కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉన్న ఒక చెట్టుకింద తన వృత్తిపని చేసుకుంటన్నారు.
వర్షానికి, ఎండనుండి కాపాడుకునేందుకు అట్టముక్కలు, ప్లాస్టిక్ కవర్‌ను తలపైన చిన్న షెడ్డుగా వేసుకున్నాడు. వృత్తిపని చేసుకునే స్థలం నుండి రెండుకిలోమీటర్ల దూరంలోని (రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం) లెనిన్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, తాను చేస్తున్న మోచీ పనిద్వారా రోజూ రెండు వందల నుండి మూడు వందల రూపాయల ఆదాయం వస్తోందన్నారు.తనకు రోజూ వచ్చే ఆదాయంతో పాటు, దివ్యాంగుడు కావడం వల్ల నెలనెలా వెయ్యిరూపాయల పింఛన్ కూడా వస్తోందన్నాడు.
ఈ ఆదాయంతో సంతోషంగా తన భార్యతో కలిసి జీవిస్తున్నాని, నలుగురు కొడుకులు ఉన్నారని, వారు కూడా ఇదే వృత్తిలో కొనసాగుతున్నారని వివరించారు. తాను ఏమీ చదువుకోలేదని, అయితే జీవించేందుకు ఎవరైనా ఏదైనా వృత్తిపని చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదన్నాడు. చదువుకున్న వాళ్లు కూడా తమ స్థాయిలో ఏదో ఒక పని చేసుకోవచ్చని, సర్కారు కొలువు లేదా మరో కొలువు మాత్రమే చేయాలనుకోవద్దన్నారు. జీవించేందుకు ఎవరికి వారికి తమపై ఆత్మవిశ్వాసం, నమ్మకం ఉంటే ఎలాగైనా జీవించవచ్చని మోహన్ వివరించాడు.

చిత్రం.. హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ ఎదుట మోచీ వృత్తిలో మోహన్