తెలంగాణ

రాష్ట్రానికి రూ.1700 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 25:ఒకవైపు వర్షాలు మరో వైపు చెరువుల్లో నిండుగా నీళ్లు వ్యవసాయ పనులు ప్రారంభించాలంటే రైతుల వద్ద డబ్బులు లేవు, బ్యాంకుల్లో , ఏటిఎంలలో డబ్బు లు కనిపించడం లేదు. ఏ బ్యాంకులోనైనా డబ్బులు ఉన్నాయంటే భారీ క్యూలు కనిపిస్తున్నాయి. సోమవారం నుంచి రైతులకు బ్యాం కుల్లో నగదు లభించే అవకాశం ఉందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. వ్యవసాయ పనులకు కూలీ నగదుగానే చెల్లిస్తారు కానీ చెక్కులు ఇవ్వరని, బ్యాంకులు దీన్ని దృష్టి లో పెట్టుకుని అవసరమైనంత నగదు నిల్వలు అందుబాటులో ఉంచాలని మంత్రి కోరారు. నగదు నిల్వలు సరిపోయినంతగా లేకపోవడం వల్ల బ్యాంకుల ముందు క్యూలు కనిపిస్తున్నాయని, పరిస్థితి గురించి ఆర్‌బిఐ దృష్టికి తీసుకు వెళ్లినట్టు చెప్పారు. ఆర్‌బిఐ నుంచి సోమవారం రాష్ట్రానికి 17వందల కోట్ల రూపాయలు రానున్నాయని చెప్పారు. ఈ మొత్తం కూడా సరిపోదని మరోఐదువేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌బిఐని కోరింది. కరెన్సీ రద్దు తరువాత బ్యాంకుల ముందు ఎక్కడ చూసినా భారీ క్యూలు దర్శన మిచ్చాయి. ఇప్పుడు నగరాల్లో, పట్టణాల్లో అలాంటి పరిస్థితి లేకపోయినా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం నోట్ల రద్దు నాటి పరిస్థితులు దర్శనం ఇస్తున్నాయి. చాలా బ్యాంకుల్లో అవసరం అయినంత నగదు లేదు. వ్యవసాయ సీజన్ కావడంతో అవసరమైనంత నగదు నిల్వ చేసుకోవడంతో బ్యాంకులు విఫలం అయ్యాయి.
కరెన్సీ రద్దు తరువాత రాష్ట్రానికి 53వేల కోట్ల రూపాయల వరకు కొత్త కరెన్సీ వచ్చింది. అయితే వీటిలో 95శాతం వరకు రెండు వేల రూపాయల నోట్లే అని ఆర్థిక మంత్రి తెలిపారు. ఐదువందల రూపాయలు, వెయ్యి రూపాయల కరెన్సీ రద్దు చేసి, వాటి స్థానంలో రెండువేల రూపాయల నోటు, ఐదువందల రూపాయల కొత్త నోట్లు విడుదల చేశారు. అంతకు ముందు నుంచి వంద రూపాయల నోట్లు అలానే చెలామణిలో ఉన్నాయి. నోట్ల రద్దు తరువాత త్వరలోనే పరిస్థితి సర్దుకుంటుంది, బ్యాంకులకు అవసరమైన నగదు పంపిస్తున్నామని ఆర్‌బిఐ చెప్పినా అలాంటి పరిస్థితి మాత్రం కనిపించడం లేదని ఆర్థిక మంత్రి తెలిపారు. ఇన్ని రోజుల తరువాత కూడా నగదు సమస్యగా ఉందని అన్నారు.
బ్యాంకులు రైతులను ఇబ్బంది పెట్టవద్దని కోరారు. వ్యవసాయ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని అవసరమైన నగదు అందజేయాలని ఆర్‌బిఐని కోరినట్టు చెప్పారు.