తెలంగాణ

బిజెపి బంధంపై టిఆర్‌ఎస్‌లో చర్చ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 26: బిజెపి టిఆర్‌ఎస్ బంధంపై టిఆర్‌ఎస్‌లో జోరుగా చర్చ సాగుతోంది. 2019 ఎన్నికల్లో తెలంగాణలో మేమే అధికారంలోకి వస్తామని తెలంగాణ బిజెపి నాయకులు ఒకవైపు ప్రకటనలు చేస్తుండగా, టిఆర్‌ఎస్ మాత్రం రోజు రోజుకు బిజెపి ఢిల్లీ నాయకత్వానికి చేరువ అవుతోంది. రాష్టప్రతి ఎన్నికల్లో ముందుగానే టిఆర్‌ఎస్ బిజెపికి మద్దతు ప్రకటిచింది. స్పీకర్‌గా తెలంగాణ ఏర్పాటుకు సహకరించిన కాంగ్రెస్ అభ్యర్థి మీరా కుమార్‌కు ఓటు వేసి రుణం తీర్చుకోవాలని కాంగ్రెస్ కోరింది.
తెలంగాణ బిల్లుపై పార్లమెంటులో కీలక సమయంలో మీరా కుమార్ చేసిన సహకారం గుర్తుంచుకోవాలని కాంగ్రెస్ నాయకులు కోరుతున్నారు. మీరా కుమార్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించక ముందే టిఆర్‌ఎస్ బిజెపి అభ్యర్థికి మద్దతు ప్రకటించిందని, మీరా కుమార్ అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ ముందుగా తమను సంప్రదించలేదని టిఆర్‌ఎస్ నాయకులు చెబుతున్నారు. రాష్ట్ర బిజెపి నాయకులను టిఆర్‌ఎస్ నాయకత్వం పెద్దగా పట్టించుకోవడం లేదు. అదే సమయంలో ఢిల్లీ నాయకత్వంతో మాత్రం సన్నిహితంగా ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బిజెపి నాయకులు చేస్తున్న విమర్శలకు పెద్దగా గుర్తింపు లభించడం లేదు. గతంలో రాష్ట్రంలో బిజెపి ఎదిగేందుకు అవకాశం ఉన్న సమయంలో టిడిపితో పొత్తు వల్ల ఎదగలేక పోయింది. రాజకీయ అవకాశాలను ఉపయోగించుకోలేక పోయింది.
1996లో బిజెపి సొంతంగా పోటీ చేసినప్పుడు తెలంగాణలో దాదాపు 25శాతం ఓట్లు వచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలో 18శాతం ఓట్లు వచ్చాయి. అనంతరం టిడిపి, బిజెపి కలిసి పోటీ చేశాయి. ఆ పొత్తు వల్ల బిజెపి సొంతంగా ఎదిగే ప్రయత్నాలకు బ్రేకు పడింది. బిజెపి దేశమంతా మోదీ హవా సాగిన సమయంలో కూడా టిడిపితో పొత్తు బంధం బిజెపిని ఎదగకుండా చేసింది. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో టిడిపి నామ మాత్రంగా మారింది. టిడిపి స్థానాన్ని బిజెపి కైవసం చేసుకుంటుందని ఎంఐఎం శ్రీకృష్ణ కమిటీ ముందు అభిప్రాయం వ్యక్తం చేసింది. తెలంగాణ ఏర్పడిన తరువాత 2014 ఎన్నికల్లో కూడా టిడిపి, బిజెపి పొత్తు వల్ల తెలంగాణలో బిజెపి ప్రభావం చూపలేకపోయింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కేవలం ఐదు స్థానాలకు పరిమితం అయింది. ఇప్పుడు టిఆర్‌ఎస్ కేంద్రంలో బిజెపితో వ్యూహాత్మకంగా చేరువు అవుతోంది. దీని వల్ల తెలంగాణలో బిజెపికి పెద్దగా అవకాశాలు ఉండవు అనేది టిఆర్‌ఎస్ అంచనా. ఇదే సమయంలో టిఆర్‌ఎస్‌లో సైతం రెండు పార్టీల స్నేహం మధ్య చర్చ సాగుతోంది.
ఎన్‌డిఏ ప్రభుత్వంలో టిఆర్‌ఎస్ ఇప్పటికప్పుడు చేరే అవకాశం లేకపోయినా ఎన్నికల తరువాత పరిణామాలు మారవచ్చుననే చర్చ టిర్‌ఎస్‌లో సాగుతోంది. ప్రత్యేకంగా ఒక పార్టీకి వ్యతిరేకం, అనుకూలం అని కాకుండా రాష్ట్రానికి ప్రయోజనం కలిగే విధంగా కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వంతో సన్నిహితంగా ఉండాలి అనే అభిప్రాయం టిఆర్‌ఎస్ నాయకులు వ్యక్తం చేస్తున్నారు.