తెలంగాణ

ఉద్యోగాల్లో రెండంచెల వ్యవస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 26: తెలంగాణలోని ఉద్యోగులకు సంబంధించి ప్రస్తుతం అమల్లో ఉన్న మూడంచెల వ్యవస్థ స్థానంలో రెండంచెల వ్యవస్థ తీసుకువచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. రాష్ట్రంలో రాష్ట్ర క్యాడర్, జోనల్ క్యాడర్, జిల్లా క్యాడర్ పోస్టులంటూ ఉన్నాయి. రాష్టప్రతి ఉత్తర్వుల (జీఓ ఎంఎస్ నెంబర్ 674, సాధారణ పరిపాలన శాఖ, 20-10-1975) మేరకే మూడంచెల వ్యవస్థ ఏర్పడ్డది. రెండంచెల వ్యవస్థ తీసుకురావాలంటే రాష్టప్రతి ఉత్తర్వులకు సవరణ చేయాల్సి ఉంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వం ఆమోదం లభించిన తర్వాత దీన్ని రాష్టప్రతికి నివేదించాల్సి ఉంటుంది.
సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల భర్తీలో స్థానికులకు న్యాయం చేయాలని జోనల్ వ్యవస్థను తీసుకువచ్చారు. ఎపిలో నాలుగు జోన్లు ఉండగా తెలంగాణలో రెండు జోన్లు ఉన్నాయి. హైదరాబాద్ నగరాన్ని ‘ఫ్రీజోన్’ అన్నప్పటికీ అదో వివాదంగా మారింది. జోనల్ విధానం ప్రకారం కోస్తా, రాయలసీమకు చెందిన 13 జిల్లాలను నాలుగు జోన్లుగా రూపొందించారు. తెలంగాణలోని పాతజిల్లాలైన ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలను ఐదో జోన్ కిందకు, హైదరాబాద్ (జిల్లా), రంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ జిల్లాలను ఆరోజోన్ పరిధిలోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం 10 జిల్లాల స్థానంలో 31 జిల్లాలు ఏర్పడ్డాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటం వల్ల జోనల్ వ్యవస్థ అవసరం లేదని భావిస్తున్నారు. అందుకే ఈ వ్యవస్థను తొలిగించి, రాష్టస్థ్రాయి పోస్టులు, జిల్లాస్థాయి పోస్టులు అంటూ రెండంచెల విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.
వాస్తవంగా ఈ అంశంపై మొదట సమగ్రమైన అధ్యయనం, పరిశీలన జరిగిన తర్వాత రూపొందించే నివేదికపై మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉండేది. అయితే తొలుత లాంఛనంగా మూడంచెల వ్యవస్థస్థానంలో రెండంచెల వ్యవస్థను తీసుకురావాలని మంత్రివర్గం ఆమోదించింది. ఇప్పుడు ఈ అంశంపై చర్చలు జరిపేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అధికారాలు ఇచ్చారు.
ఏయే పోస్టులను జిల్లాస్థాయి పోస్టులుగా భావించాలి, ఏ స్థాయి పోస్టులను రాష్టస్థ్రాయి పోస్టులుగా భావించాలన్న అంశంపై నిర్ణయం తీసుకోవాలి. వివిధ శాఖల ప్రధాన అధికారులతో, వివిధ ఉద్యోగ సంఘాల నేతలతో సమగ్రంగా చర్చించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అందరితో చర్చించిన తర్వాత రూపొందించే నివేదికను కేంద్రానికి పంపించాల్సి ఉంటుంది. ప్రధాన కార్యదర్శి రూపొందించే నివేదికను మళ్లీ మంత్రివర్గం పరిశీలిస్తుందా? లేదా? అన్నది సిఎం ఇష్టాలపై ఆధారపడి ఉంటుంది. ప్రధాన కార్యదర్శి రూపొందించే నివేదికను కేంద్రం పరిశీలించాలి. రాష్టప్రతి ఆమోదం కోసం దాన్ని పంపించాలి. రాష్టప్రతి ఆమోదిస్తే, ప్రస్తుతం అమల్లో ఉన్న ఉత్తర్వులకు సవరణ చేసేందుకు వీలవుతుంది. ఈ మొత్తం వ్యవహారం పూర్తయ్యేందుకు ఆరు నెలల కాలం నుండి ఏడాది వరకు పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.