తెలంగాణ

ఘనంగా రంజాన్ వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 26: రంజాన్ (ఈద్-ఉల్-్ఫతర్) పర్వదినాన్ని సోమవారం ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. పాతనగరంలోని మసీదులు, ఈద్గాలు కిటకిటలాడాయి. చార్మినార్ సమీపాన గల మక్కా మసీదు, మాదన్నపేటలోని ఈద్గా, ఇంకా అనేక మసీదులు, ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మీరాలం ఈద్గాలో ఖురాన్ ప్రవచనాలకు భారీ సంఖ్యలో ముస్లింలు తరలి వచ్చారు. నగర పోలీసు కమిషనర్ పి. మహేందర్ రెడ్డి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 10 వేల మంది పోలీసులను బందోబస్తుకు వినియోగించారు. ప్రార్థనల అనంతరం ముస్లింలకు హిందువులు శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా అన్ని పార్టీల నాయకులు కూడా ముస్లింలకు శుభాకాంక్షలు చెప్పారు.

చిత్రాలు.. రంజాన్ పర్వదినం సందర్భంగా సోమవారం చార్మినార్ వద్ద మక్కా మసీదులో పరస్పరం పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటున్న బాలిక, బాలుడు. భక్తి శ్రద్ధలతో నమాజు చేస్తున్న ముస్లింలు