తెలంగాణ

జూరాలకు జలకళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, జూన్ 26: సాగు, తాగునీటి కోసం రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో లడాయికి దిగినప్పటికీ నీరురాక తీవ్ర ఇబ్బందులు పడ్డ నడిగడ్డ ప్రజలకు వరుణదేవుడి కరుణతో ముందస్తు వర్షాలు మురిపించాయి. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు కృషా ణపరివాహక ప్రాంతాలు, జూరాల ప్రాజెక్టు పరిసర ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలతో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువలో ఉంది. గత పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు వచ్చి నీరు చేరుతుండడంతో రోజు రోజుకూ ప్రాజెక్టు నీటిమట్టం పెరుగుతూ వస్తోంది. సోమవారం జూరాల జలాశయానికి ఎగువ ప్రాంతం నుండి 4,333 క్యూసెక్కుల వరదనీరు వర్చి చేరుతుండడంతో జూరాల జలాశయంలో 7.010 టిఎంసిల నీరు నిల్వ ఉంది. దీంతో ఎగువ ప్రాంతంలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుండి వరద రాకున్నప్పటికీ వర్షపు నీరు చేరికతో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువవుతుండడంతో ఆయకట్టు రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. జూరాల పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టిఎంసిలకు గాను 7.010 టిఎంసిలు నీరు చేరడంతో మరో వారంలోగా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటుందని అధికారులు సంబరపడుతున్నారు. ఇప్పటికే జూరాల కుడి, ఎడమ కాలువలకు సాగునీటిని విడుదల చేసేందుకు సన్నద్ధమవుతుండగా తాజాగా నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి కూడా నీటిని విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది.
అదే విధంగా ఎగువ ప్రాంతంలోని ఆల్మట్టి జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 129.72 టిఎంసిలకు గాను 11.50 టిఎంసిల నీరు నిల్వ ఉంది. నారాయణపూర్ జలాశయంలో 37.646 టిఎంసిలకు గాను 15.04 టిఎంసిల నీరు నిల్వ ఉంది. జూరాలకు ముందస్తుగా వర్షపు చేరికతో పూర్తి స్థాయి మట్టానికి చేరుకుంటుండడంతో ఆయకట్టు రైతులు ముందస్తు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. అదే విధంగా జూరాల జలవిద్యుత్కేంద్రం అధికార యంత్రాంగం కూడా విద్యుత్ ఉత్పత్తి కోసం సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది.

చిత్రం.. పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువలో జూరాల జలాశయం