తెలంగాణ

ఏకీకృత ఘనత మాదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, జూన్ 26: గత రెండు దశాబ్దాలుగా ప్రభుత్వ, పంచాయతీరాజ్ విద్యారంగంలో నెలకొన్న వివాదానికి చరమగీతం పాడి, ఏకీకృత సర్వీసులు నిబంధనలు సాధించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఉమ్మడి సర్వీసు నిబంధనలపై ఉపాధ్యాయ సంఘాలు, మేధావులతో కలిసి కరీంనగర్ డెవలప్‌మెంట్ ఫోరం ఆధ్వర్యంలో జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన చర్చాగోష్టిలో ముఖ్యఅతిధిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రం నుంచి ఏన్నో ఏళ్ళుగా రాద్ధాంతమవుతున్న ఈ వివాదానికి అతి త్వరలోనే శాశ్వత పరిష్కారం లభించనుండడం హర్షణీయమన్నారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్‌తో కొద్దిరోజుల్లోనే పంతుళ్ళకు పదోన్నతులు లభించడమే కాక, విద్యా ప్రమాణాలు కూడా మెరుగవుతాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. పదోన్నతులతో ఏర్పడిన ఖాళీల్లో నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయని, విద్యావ్యవస్థలో నెలకొన్న పదోన్నతుల సంక్షోభానికి త్వరలోనే తెరపడనుందన్నారు. ఏకీకృత సర్వీస్ రూల్స్‌పై ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక దృష్టి సారించి, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుపై చేసిన ఒత్తిడితో అధికారులను కలిసి సమస్యను వివరించగా, రెండు రోజుల్లోనే దస్త్రంపై రాష్టప్రతి సంతకం చేశాడని, ఇది మునుపెన్నడూ చరిత్రలో జరగలేదని అన్నారు. దీంతో 1998 నుంచి నలుగుతున్న ఈ వివాదం కొద్దిరోజుల్లో సమసిపోనున్నాయని, ప్రభుత్వ, పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల సర్వీసులు ఏకీకృతం కానున్నాయన్నారు. వీరందరి సీనియార్టీని పరిగణనలోకి తీసుకుంటూ లోకల్ కేడర్ ఆర్గనైజ్డ్ కాని మండల విద్యాధికారులు, డిప్యూటీ డిఈవోలు, డైట్ లెక్చరర్లు, డిఎడ్, బిఎడ్ కళాశాలల లెక్చరర్లు, 2005 నుంచి భర్తీకాని స్టేట్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్‌లోని పోస్టులు నేడో, రేపో భర్తీకానున్నాయన్నారు.
ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలను బతికించుకునేందుకు ప్రతిఒక్కరు కృషి చేయాల్సిన అవసరముందని అన్నారు. పలువురు ఉపాధ్యాయ నేతలు మాట్లాడుతూ, జోనల్ వ్యవస్థను రద్దు చేయాల్సిందేనని, రెండంచెల విధానమైన జిల్లా, రాష్ట్ర స్థాయి పోస్టులు మాత్రమే ఉండాలని సూచించారు. విద్యారంగ అభివృద్ధి కోసం ఎస్జీటి స్థాయి నుంచి డైరెక్టర్ వరకు పదోన్నతులు కల్పించాలని, ఐఎఎస్‌ల నియామకంతో విద్యారంగం కుంటుపడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
ఈ చర్చాగోష్టిలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యే పుట్ట మధు, జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, డిప్యూటీ డిఈవో కట్ల ఆనందం, ఉపాధ్యాయ సంఘాల నేతలు మాటేటి ప్రతాప్‌రెడ్డి, ఎం. రఘుశంకర్‌రెడ్డి, నరహరి లక్ష్మారెడ్డి, డిటిఎఫ్ చంద్రవౌళి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. చర్చాగోష్టిలో మాట్లాడుతున్న మంత్రి ఈటల రాజేందర్