తెలంగాణ

ఎరువులపై జిఎస్టీ ఉపసంహరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జూన్ 26: ఎరువులపై జిఎస్టీ ఉపసంహరించుకోవాలని భారీ నీటి పారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్‌రావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సిద్దిపేటలో డిసిసిబి కొత్త భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులనుద్దేశించి మాట్లాడుతూ బ్యాంకుల వద్ద డబ్బుల కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కేంద్రం నుంచి స్పందన కరువైందన్నారు.
నోట్ల రద్దు జరిగి ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ప్రజలకు నగదు అందుబాటులో ఉంచడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని, కేంద్ర ప్రభుత్వమే లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. జిఎస్టీ రూపంలో రైతులపై అదనపు భారం మోపవద్దని కోరారు. ఒకప్పుడు ధాన్యం కొనాలని రైతులు ధర్నాలు చేశారని, ఇప్పుడు కొన్న ధాన్యానికి డబ్బుల కోసం రైతులు బ్యాంకుల వద్ద ధర్నాలు చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతుల ఖాతాల్లో నగదు జమైనా బ్యాంకుల్లో డబ్బులు లేవని, ఈ విషయంపై కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ చొరవ తీసుకొని బ్యాంకుల్లో డబ్బులు ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. మధ్యప్రదేశ్‌లో రైతులపై లాఠీచార్జి జరిగిందని, తమిళనాడు, కర్ణాటకల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి తెలంగాణలో కూడా తలెత్తే అవకాశం ఉందన్నారు. ఈ సీజన్‌లో 60 వేల కోట్లతో 40 లక్షల క్వింటాళ్ల ధాన్యం సేకరించామన్నారు. రైతులకు కరంట్, సాగునీరు, ఎరువులు, విత్తనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా యాసంగిలో 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని, దీని విలువ 60 వేల కోట్లు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ దేవేందర్‌రెడ్డి, చైర్మన్ రాజనర్సు, సొసైటీ చైర్మన్లు పాల్గొన్నారు.
టెట్ అభ్యర్థులకు మెటీరియల్ పంపిణీ
పేద విద్యార్థులకోసం అందిస్తున్న ఉచిత టెట్‌కోచింగ్‌కు 1500కు పైగా అభ్యర్థులు హాజరు కావడం సంతోషకరమన్నారు. అభ్యర్థులు ఉచిత కోచింగ్‌ను సీరియస్‌గా తీసుకొని ఉద్యోగ లక్ష్యమే ధ్యేయంగా కృషి చేయాలన్నారు. సిద్దిపేటలోని మార్కెట్‌యార్డులో టెట్ అభ్యర్థులకు మెటీరియల్‌ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఉచిత కోచింగ్‌లో 75 శాతానికి పైగా అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు.

చిత్రం.. సిద్దిపేటలో డిసిసిబి భవనాన్ని ప్రారంభిస్తున్న మంత్రి హరీష్‌రావు