తెలంగాణ

గ్రామాభివృద్ధిలో అందరి భాగస్వామ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలేరు, జూన్ 26: గ్రామాల సమగ్రాభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పిలుపునిచ్చారు. తన దత్తత గ్రామమైన యాదాద్రి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో సోమవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఈఎస్‌ఐ ఆస్పత్రి వైద్య శిబిరాన్ని పరిశీలించారు. అదేవిధంగా జైన్ ట్రస్ట్‌కు అందించిన ట్రాక్టర్ బహూకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామాభివృద్ధి కోసం బాలల చేత బాల కిశోర సేన ఏర్పాటుచేసి గ్రామస్థులను భాగస్వాములను చేసే ఆలోచన కొలనుపాక గ్రామం నుంచి దేశ వ్యాప్తంగా ప్రారంభమైందన్నారు. బ్యాంకుల ద్వారా చిన్న, మధ్యతరహా, భారీ రుణాలను ఇప్పటివరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 20 వేల మంది లబ్ధిదారులకు 253 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. చిన్నస్థాయి కుంటలు, ఇంకుడు గుంతలు, వర్మీ కంపోస్ట్ కేంద్రాలు, మరుగుదొడ్ల నిర్మాణానికి మరో 20 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. అయతే, కేంద్రం నుంచి వస్తున్న నిధులను సక్రమంగా వినియోగించకపోవడం బాధాకరమన్నారు. యాదాద్రి, జనగాం, సిద్ధిపేట జిల్లాలను కలుపుతూ యాదాద్రి దేవస్ధానం అభివృద్ధిలో భాగంగా 8 లింక్ రోడ్లను ఏర్పాటుచేసే ప్రతిపాదనను తయారుచేశామన్నారు. మరో రెండు సంవత్సరాల్లో దత్తత గ్రామం కొలనుపాక పర్యాటకంగా అభివృద్ధిలో ముందుండేలా అన్ని రకాల ప్రణాళికలు రూపొందించి అభివృద్ధి చేస్తామన్నారు. అనంతరం గ్రామాభివృద్ధిలో, సాక్షర భారత్ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న విద్యార్థులకు సర్ట్ఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ మేధా, స్కిల్ డెవలప్‌మెంట్ అథారిటీ డైరెక్టర్ ధర్మవరపు రామ్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. యాదాద్రి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామాభివృద్ధిపై జరిగిన సమీక్షలో
మాట్లాడుతున్న కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ