తెలంగాణ

నిధులు కేంద్రానివి.. ప్రచారం రాష్ట్రానిదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, జూన్ 26: రాష్ట్భ్రావృద్ధి కోసం కేంద్రం విడుదల చేస్తున్న నిధులతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన సొంత ప్రచారం చేసుకుంటూ, ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తోందని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం నగరంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, వరుస కరవుతో అల్లాడి, అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులను ఆదుకునేందుకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడితే, రాష్ట్రంలో ఇక్కడి ప్రభుత్వం దీనిని నీరుగార్చిందని విమర్శించారు. ఈ పథకంలో రైతులను చేర్చేందుకు కనీస అవగాహన కూడా కల్పించకుండా నిర్లక్ష్యం వహించిందని, ఫలితంగా 15 లక్షల మంది రైతులకుగాను కేవలం 20 శాతంలోపే రైతులు ఈ పథకంలో చేరినట్లు వెల్లడించారు. కేంద్ర నిధులతో ప్రారంభించిన ఫసల్ బీమా ప్రచారంలో మాత్రం తన పటాటోపాన్ని ప్రదర్శించిందని విమర్శించారు. కరపత్రాల్లో కేవలం కెసిఆర్, పోచారం బొమ్మలు మాత్రమే వేసుకుని ప్రధాని మోదీ ఫొటోను విస్మరించారని మండిపడ్డారు. గత ప్రభుత్వాలు మండలం యూనిట్‌గా తీసుకుంటే, ఎన్‌డిఏ మాత్రం రైతును యూనిట్‌గా తీసుకుని బీమా పథకం కొనసాగిస్తోందన్నారు. అయినా, పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఉసురుతీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర పథకాల పేరు మార్చి రాష్ట్రంలో కొనసాగిస్తున్నారని అన్నారు. ఓట్ల రాజకీయాలు చేస్తూ ప్రజాసంక్షేమం వీడిందని దుయ్యబట్టారు.
అన్నదాతల పంట ఉత్పత్తుల కొనుగోళ్ళపై అత్యంత శ్రద్ధ చూపుతున్నామని చెప్పుకుంటూనే, ధాన్యం రైతులకు నెలలు గడుస్తున్నా డబ్బులు మాత్రం చెల్లించడం లేదని దుమ్మెత్తిపోశారు. అన్నదాత వ్యతిరేక వైఖరిని అనుసరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈనెల 30న వ్యవసాయశాఖ కమిషనరేట్ ఎదుట భారీ ధర్నా తలపెట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ధర్నాకు తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున రైతులు తరలిరావాలని పిలుపునిచ్చారు.