తెలంగాణ

పాఠ్యపుస్తకాల సంస్కరణపై ‘యుద్ధం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 27: పాఠ్యపుస్తకాల సంస్కరణకు సంబంధించి మంగళవారం నాడు ఢిల్లీలో జరిగిన ఎన్‌సిఇఆర్‌టి 54వ జనరల్ కౌన్సిల్ సమావేశంలో ‘యుద్ధం’ జరిగింది. వివిధ రాష్ట్రాల మంత్రులు, జనరల్ కౌన్సిల్ సభ్యులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. 53వ జనరల్ కౌన్సిల్ మినిట్స్‌ను ఆమోదించిన జనరల్ కౌన్సిల్ 54వ సమావేశంలో ప్రధానంగా పాఠ్యపుస్తకాల సంస్కరణలపై విస్తృతంగా చర్చించింది. ఈ సమావేశంలో కౌన్సిల్ సభ్యులు 66 మంది పాల్గొన్నారు. సమావేశానికి హెచ్‌ఆర్‌డి మంత్రి ప్రకాష్ జవదేకర్ అధ్యక్షత వహించారు. యుజిసి చైర్మన్ ప్రొఫెసర్ వేద్ ప్రకాష్, కార్యదర్శి డాక్టర్ ఎస్సీ కుంతియ తదితరులతో పాటు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పాల్గొన్నారు.
పాఠ్యపుస్తకాలు సైద్ధాంతిక యుద్ధ్భూమి కారాదని ఢిల్లీ విద్యామంత్రి మనీష్ సిసోడియా పేర్కొన్నారు. అటు వామపక్ష సిద్ధాంతాలు, ఇటు సంప్రదాయ హిందూ సిద్ధాంతాలను రుద్దవద్దని, విద్యార్ధి కేంద్రకంగా వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని పాఠ్యపుస్తకాల సంస్కరణ జరగాలని సూచించారు. విద్యార్ధులు ఎంత వరకూ నేర్చుకుంటున్నారో ఎప్పటికపుడు సమీక్షించడంతో పాటు దానిపై విద్యార్ధులకు, వారి తల్లిదండ్రులకూ అవగాహన కల్పించాలని, వారికి అవసరమైన సమాచారాన్ని అందుబాటులో ఉంచాలని సమావేశంలో నిర్ణయించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పాఠ్యపుస్తకాలు డిజిటల్ రూపంలో అందరికీ ఉచితంగా అందుబాటులోకి తీసుకురావల్సి ఉందని, ఇందుకు ఇప్పటికే 8 రాష్ట్రాలు సుముఖత వ్యక్తం చేశాయని, మిగిలిన రాష్ట్రాలు సైతం ముందుకు రావాలని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది.
అలాగే అన్ని రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున బోధన సిబ్బంది నియామకాలు అనునిత్యం జరుగుతున్నా, బోధనేతర సిబ్బంది గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని కనీసం ఇక మీదట బోధనేతర సిబ్బంది నియామకాలపైనా రాష్ట్రాలు శ్రద్ధ వహించాలని కేంద్ర మానవవనరుల మంత్రి ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు. అలాగే కొత్త పాఠ్యగ్రంథాలకు సంబంధించిన చేర్పులు మార్పులపై ఇప్పటికే రాష్ట్రాల అభిప్రాయాలను కోరిన కేంద్రం అందుకు ఈ నెలాఖరు వరకూ గడువు విధించింది. కాగా ఎన్‌సిఇఆర్‌టి పాఠ్యపుస్తకాలు మార్కెట్‌లో అందుబాటులో లేకుండా పోతున్నాయని, అవసరమైతే ప్రచురణ బాధ్యతలను ఇతరులకు సైతం అప్పగించాలని వివిధ రాష్టల్ర మంత్రులు సూచించారు. కళా ఉత్సవ్, వీర్ గాథ అనుబంధ గ్రంథాలతో పాటు ఆ తరహాలో మరిన్ని గ్రంథాలను కూడా పిల్లలకు అందుబాటులోకి తీసుకురావాలని సమావేశంలో సూచించారు. రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్‌ను విజయవంతం చేయడం, ఇ పాఠశాలలో అన్ని రాష్ట్రాల పాఠ్యగ్రంథాలను డిజిటల్ రూపంలో ఉంచడం, నేషనల్ అచీవ్‌మెంట్ సర్వేను విజయవంతం చేయడం, అభ్యసన ప్రగతిని అందరికీ తెలియజేసేందుకు మొబైల్ యాప్ రూపొందించడం, మహిళా విజేతల గాథలు సిద్ధం చేయడం వంటి అంశాలపై కూడా చర్చ జరిగింది. కాగా తెలంగాణలో పాఠశాల విద్యాశాఖలో అమలుచేస్తున్న పథకాలను వివరించిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇందుకు కేంద్రం సహకరించాలని కోరారు.
వెంకయ్యకు ధన్యవాదాలు
తెలుగు రాష్ట్రాల్లో జిల్లా పరిషత్ టీచర్లకు ఉమ్మడి సర్వీసు నిబంధనలను కేంద్రం ఆమోదించడంలో విశేషకృషి చేసిన కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడును కలిసి కడియం శ్రీహరి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ పథకాలు, కార్యక్రమాలను వెంకయ్యకు ఉప ముఖ్యమంత్రి వివరించారు.