తెలంగాణ

నామినేటెడ్ పోస్టులపై కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 27: కంటి ఆపరేషన్ కోసం ఢిల్లీలో మకాం వేసిన ముఖ్యమంత్రి కెసిఆర్ గత రెండు రోజుల నుంచి నామినేటెడ్ పదవులపై పార్టీ నాయకులతో కసరత్తు సాగిస్తున్నారు. నియోజక వర్గాల వారీగా నామినేటెడ్ పదవుల కోసం పదిహేను మంది పేర్లతో ఎమ్మెల్యేలు, నియోజక వర్గం ఇన్‌చార్జ్‌లు ఇంతకు ముందే కెసిఆర్‌కు జాబితా అందజేశారు. కొంత మంది నాయకులతో కెసిఆర్ ఢిల్లీ నుంచే ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకుంటున్నారు. ఢిల్లీలో అందుబాటులో ఉన్న నాయకులతోనూ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు.
దేవాలయ కమిటీలు, మార్కెట్ కమిటీలు, కొన్ని కార్పొరేషన్లకు ఇప్పటి వరకు నియామకాలు జరిగాయి. దాదాపు నాలుగు వేల మందికి మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పదవులు లభించాయి. కొత్తగా కొన్ని పదవులను సృష్టించారు. 75వేల రూపాయల వేతనంతో జిల్లాకు ఒక ఉమెన్ ఆర్గనైజర్‌ను కొత్తగా నియమించారు. అదే విధంగా తొలిసారిగా జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులకు 75వేల గౌరవ వేతనం నిర్ణయించారు.
రాష్టస్థ్రాయిలో దాదాపు 30 కార్పొరేషన్లలో ఇంకా నియామకాలు చేపట్టాలి. అదే విధంగా కొన్ని ఆలయాల పాలక వర్గాలను నియమించాలి. కార్పొరేషన్ పదవుల కోసం పలువురు నాయకుల పేర్లను ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నారు. ఒకవైపు కంటి ఆపరేషన్ కోసం ఢిల్లీలో మకాం వేసిన ముఖ్యమంత్రి రెండు రోజుల నుంచి నామినేటెడ్ పదవులపై దృష్టిసారించడంతో నాయకులు విస్తుపోతున్నారు. ఐదుగురు శాసన సభ్యులను పార్లమెంటరీ సెక్రటరీ అని క్యాబినెట్ హోదాలో నామినేటెడ్ పదవులు ఇవ్వగా, దీనిపై అప్పుడు కాంగ్రెస్‌లో ఉన్న నల్లగొండ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి కోర్టుకు వెళ్లారు. క్యాబినెట్ హోదాతో పదవులు చెల్లవని కోర్టు తీర్పు చెప్పడంతో వారి పదవులను తొలగించారు.
ఆ తరువాత వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. కేసు వేసిన గుత్తా సుఖేందర్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి టిఆర్‌ఎస్‌లో చేరారు. ఆ ఐదుగురు ఎమ్మెల్యేలకు మాత్రం ఎలాంటి పదవులు లభించలేదు. సాధారణ ఎన్నికలకు ఇంకా 22నెలల వ్యవధి ఉన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని నానినేటెడ్ పదవుల పంపకాన్ని ఇప్పటికైనా వెంటనే పూర్తి చేస్తే బాగుంటుందని కొందరు నాయకులు ముఖ్యమంత్రికి సూచించారు. గతంలో ఎమ్మెల్యేలు నామినేటెడ్ పదవుల కోసం నియోజక వర్గాల వారిగా ప్రతిపాదనలు పంపించారు. ముఖ్యమంత్రికి మరోసారి పేర్లు అందజేశారు. ఢిల్లీ నుంచి కెసిఆర్ హైదరాబాద్‌కు తిరిగి వచ్చాక వరుసగా నామినేటెడ్ పదవుల పంపకం చేస్తారని పార్టీ నాయకులు చెబుతున్నారు.