తెలంగాణ

లుక్స్ అదుర్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 27: ఫోటోలు చూస్తే స్టార్ హోటల్స్‌కు స్వాగతం పలుకుతున్నట్టుగా ఉంది .. కానీ ఆవి స్టార్ హోటల్స్ కావు. ఆస్పత్రులు. కార్పొరేట్ ఆస్పత్రులు కూడా కావు. పక్కా ప్రభుత్వ ఆస్పత్రులు. కొత్త ఫర్నిచర్‌తో కొత్త లూక్‌లో ఆస్పత్రులను చూసి ఐటి శాఖ మంత్రి కెటిఆర్ సైతం ముచ్చటపడి ఆస్పత్రుల దృశ్యాలను ట్విట్టర్‌లో పంచుకున్నారు. కింగ్ కోటి, మలక్‌పేట ప్రభుత్వ ఆస్పత్రులు కొత్త హంగులతో అలరిస్తున్నాయి. ప్రభుత్వ వైద్య శాలలు ప్రజలకు చేరువ అవుతున్నాయని కెటిఆర్ అభినందించారు. ప్రభుత్వ ఆస్పత్రుల రూపు రేఖలు పూర్తిగా మార్చనున్నట్టు, ఆధునిక వైద్య పరికరాలు పంపిణీ చేస్తున్నట్టు వైద్య శాఖ ఇటీవల ప్రకటించింది. ఆస్పత్రుల్లో బెడ్ షీట్లను సైతం మార్చారు. ఒక్కో రోజు ఒక్కో రంగు బెడ్ షీట్లు ఉండే విధంగా మూడు రంగల్లో బెడ్ షీట్లను పంపిణీ చేశారు. ఏ వారం ఏ రంగు బెడ్ షీట్లు ఉండాలో ముందుగానే నిర్ణయించడం వల్ల, మాసిపోయిన బెడ్ షీట్లను కొనసాగించేందుకు అవకాశం లేదు.
ఆస్పత్రుల్లో ఆధునిక వైద్య పరికరాలు ఏర్పాటు చేశారు. ఎక్కువ సంఖ్యలో రోగులు వచ్చే హైదరాబాద్‌లోని ఆస్పత్రులు, జిల్లా కేంద్రంలోని ఆస్పత్రుల్లో కొత్త ఫర్నిచర్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టుల కోసం హైదరాబాద్ నగరంలో వెల్‌నెస్ సెంటర్‌లు రెండు ఏర్పాటు చేశారు. త్వరలోనే మరో ఆరు వెల్‌నెస్ సెంటర్లు పని చేయనున్నాయి. వెల్‌నెస్ సెంటర్‌లో చికిత్సతో పాటు అవసరం అయిన మందులు కూడా ఇస్తున్నారు. చివరకు ఇతర డాక్టర్ల వద్ద ఔట్ పేషంట్లుగా వైద్యం చేయించుకునే వారు. ఆ డాక్టర్ రాసిచ్చిన మందులు సైతం వెల్‌నెస్ సెంటర్ ఇస్తున్నారు. దీంతో వెల్‌నెస్ సెంటర్‌ను సందర్శించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తొలుత ఖైరతాబాద్‌లో వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు చేశారు. అనంతరం వనస్థలి పురంలో ఏర్పాటు చేశారు. గాంధీ ఆస్పత్రి, ఉస్మానియా వంటి పాత ఆస్పత్రులే తప్ప కొత్తగా నగరంలో ప్రభుత్వ ఆస్పత్రులను నిర్మించలేదు. నగరానికి నాలుగువైపు ఆస్పత్రుల నిర్మాణం చేయనున్నారు.
ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెంచే విధంగా పలు చర్యలు తీసుకుంటున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. కింగ్‌కోటి, మలక్‌పేట ఆస్పత్రుల పోటోలను కెటిఆర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అన్ని వర్గాలకు ఆస్పత్రులు అందుబాటులో ఉన్నాయని అభినందించారు. వైద్యశాఖ మంత్రిని, బృందాన్ని కెటిఆర్ అభినందించారు. తమ శాఖ పనితీరును అద్దం పట్టే విధంగా కెటిఆర్ అభినందించారని, లక్ష్మారెడ్డి తెలిపారు.