తెలంగాణ

ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షానికి ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్: జూన్ 27: ఆదిలాబాద్ జిల్లాలో మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. భారీ వర్షానికి వాగుల్లో చిక్కుకొన్ని ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఆదిలాబాద్ రూరల్ మండలం లాండసాగ్వి గ్రామంలోని వాగులో ఖలీం (21) అనే యువకుడు ప్రమాదవశాత్తు వరదలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. వాగు దాటడానికి ప్రయత్నిస్తూ బురద నీటిలో చిక్కుకొని మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సదరుమాట్ మినీ బ్యారేజీ వరద ఉధృతికి తాళ్లపల్లి శ్రావణ్ (26) అనే యువకుడు మృతి చెందాడు. నిజామాబాద్‌కు చెందిన శ్రావణ్ బ్యారేజీ అందాలను తిలకించడానికి వచ్చి వాగులో పడి మృతిచెందాడు.